పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపిస్తే ఇంకా మంచిది. దేవుడు ఓ తండ్రిలా మన తప్పిదాలను మన్నిస్తాడు అని ఈ కథ చక్కగా నిరూపిస్తుంది.

ప్రార్థనా భావాలు

1. అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు, "క్రీస్తు గొప్ప వెలుగు. ఆ ప్రభువు మనతోవుంటే మన హృదయం వెలుగుతో నిండిపోతుంది. అతడు మనలను విడనాడితే మన యెడద చీకటితో నిండిపోతుంది". తాను జగత్తునకు జ్యోతిననీ తన్ననుసరించేవాడు అంధకరాంలో నడవడనీ సెలవిచ్చాడు ప్రభువు - యోహా 8,12. ఇక, మనం చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి పాపోచ్చారణం చేసేపుడు క్రీస్తుజ్యోతి మనమిూద ప్రసరిస్తుంది. ఆ తేజస్సు మనలోని పాపాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది.

2. రెండవ శతాబ్దపు వేదశాస్త్రియైన టెర్టులియను ఈలా నుడివాడు. "ఓడ మునిగినవాళ్ళు తెప్పబట్టుకొని ఒడ్డుజేరతారు. అలాగే పాపసముద్రంలో మునిగినవాళ్లు పాపోచ్చారణం అనే తెప్పతో దైవకృప అనే తీరాన్ని చేరుతారు". కనుక నీళ్ళల్లో మునిగిపోయేవాళ్ళను తెప్పలాగ పాపంలో మునిగిపోయే మనలను ఈ సంస్కారం రక్షిస్తుంది. ఈలాంటి సదుపాయాన్ని మనం వాడుకోకపోతే అది కేవలం మన మూర్ఖత్వమే ఔతుంది.

3. 1973లో వెలువడిన నూత్న పాపోచ్చారణ విధి ఈలా చెప్తుంది. "ఈ సంస్కారంలో తండ్రి తన యింటికి తిరిగి వచ్చిన దుడుకు చిన్నవాణ్ణి ఆదరంతో అంగీకరిస్తాడు. క్రీస్తు తప్పిపోయిన గొర్రెను భుజాలమిద మోసికొని తిరుగా మందలోనికి తీసికొనివస్తాడు. పరిశుద్ధాత్మడు హృదయమందిరాన్ని మరింత పునీతంచేసి తాను ఆ మందిరంలో అధికంగా నివసిస్తాడు". ఈలా ముగ్గురు దైవవ్యక్తుల మన్ననుపొందేది పాపోచ్చారణం. కనుక మనం దానిలో ఆశతోను భక్తితోను పాల్గొనాలి.

4. జెరోముగారు ఈ వుపమానం చెప్పారు. "రోగి తన ప్రణాన్ని వైద్యునకు చూపించడానికి సిగ్గుపడి దాచిపెట్టుకొంటే వైద్యుడు ఆ పుండును మాన్పలేడు. అలాగే పాపోచ్చారణంలో మన పాపాలను గురువుతో చెప్పకోవడానికి సిగ్గుపడి వాటిని కప్పిపెట్టుకొంటే ఇక వాటికి మన్నింపు లభించదు". కొందరు ఈ సిగ్గువల్లా బిడియంవల్లా తమ పాపాలను సరిగా చెప్పరు. ఇక్కడ పిశాచ ప్రేరణం కూడ కొంత వుంటేవుండవచ్చు. ఈలాంటి వాళ్ళంతా ఈ లోపాన్ని అవశ్యం సవరించుకోవాలి.

5. నూత్న పాపోచ్చారణ విధి ప్రకారం పాపోచ్చారణాన్ని వినే గురువు పాపి హృదయంలోని పాపాలను అర్థం చేసికోవాలి. పాపి ఆ పాపాలకు నివారించుకోవడానికి అనువైన మార్గాలను సూచించాలి. గురువు ఈ సంస్కారంలో న్యాయాధిపతిగా పనిచేస్తాడు.