పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనం ఈ సంస్కారానికి పునరుజ్జీవనం కలిగించాలి. విశ్వాసులు ఈ పుణ్యకార్యంలో భక్తితోను, తరచుగాను గూడ పాల్గొనేలా చేయాలి.

7. చిన్నబిడ్డల పాపోచ్చారణం

మామూలుగా చిన్నబిడ్డలకు చావైన పాపాలంటూ వుండవు. ఐనా వాళ్ళూ చక్కగా పాపోచ్చారణం చేస్తే మంచి ఫలితం పొందుతారు. ఐనా మనం వాళ్ళను నిర్బంధం చేయకూడదు. కుటుంబంలో తల్లిదండ్రులు తమ్ము ప్రేమించినట్లు దేవుడుకూడ తమ్ము ప్రేమిస్తాడని చిన్నపిల్లలకు అర్ధంకావాలి. ఇంకా యింటిలో అమ్మా నాన్న తమ్ము క్షమించినట్లు దేవుడు కూడ తమ్ముక్షమిస్తాడని వాళ్ళకు బోధపడాలి. పిల్లలకు ఈ తెలివిని పుట్టించవలసింది ఇంటిలో తల్లిదండ్రులూ, బడిలో ఉపాధ్యాయులూ.

బిడ్డడు మొదటిసారి పాపోచ్చారణం చేసేపుడు తల్లిదండ్రులు చాల శ్రద్ధ చూపాలి. ఆ యనుభవం వాడికి భయాన్ని కాక ఆనందాన్ని కలిగించేలా వుండాలి. దేవుడు వాడికి ఓ పోలీసువాడిలా కాక నాన్నలా కన్పించాలి.

పిల్లలు మొదటిసారి పాపోచ్చారణంచేసి తర్వాత దివ్యసత్రసాదం స్వీకరిస్తారు. కాని ఇటీవల కొందరు ఈ పద్ధతిని విమర్శించారు. ఈ చిన్నప్రాయంలో బాలలు చావైన పాపాలు చేయడం అరుదు కనుక వాళ్ళచేత పాపోచ్చారణం చేయించడం మంచిది కాదన్నారు. అలా చేయిస్తే వాళ్ళకు జీవితాంతమూ ఈ సంస్కారంమిూద అనిష్టభావం కలుగవచ్చునని వాదించారు. కనుక కొన్ని ప్రాంతాల్లో బాలలకు మొదట దివ్యసత్ర్పసాద మిచ్చారు. కొన్నియేండ్లు కడచి వాళ్లు కొంచెం పెరిగి పెద్దయ్యాక పాపోచ్చారణం చేయించారు. ఈ పద్ధతి ఇటీవల యూరపులో కొన్నితావుల్లో ప్రయోగాత్మకంగా జరిగింది. కాని 1973లో శ్రీసభ ఈ ప్రయోగాన్ని రద్దుచేసింది.

పాపోచ్చారణం చేయాలంటే చావైన పాపం తప్పకుండా వుండనక్కరలేదనీ స్వల్పపాపాలు చాలుననీ ముందే చెప్పాం. కనుక పెద్దపాపాలులేని చిన్నబిడ్డలు కూడ దినిలొ పాల్గొని ఫలితాన్ని పొందవచ్చు. దీనిద్వారా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం పెంపజెందుతుంది. వాళ్లు దేవుణ్ణి ఆరాధించి కీర్తిస్తారు. పిల్లలు పాపోచ్చారణాన్ని శిక్షగా భావింపనక్కరలేదు. ప్రభువు కరుణను అనుభవానికి తెచ్చుకొనేదాన్నిగా భావించవచ్చు.

కనుక తల్లిదండ్రులూ ఉపాధ్యాయులూ కూడ పాపోచ్చారణం ద్వారా దేవుణ్ణి తోడిప్రజలనూ అధికంగా ప్రేమిస్తామని చిన్నపిల్లలకు నేర్పించాలి. పిల్లలకు సువిశేషంలోని దుడుకు చిన్నవాడి కథను వివరించి చెప్పాలి. దాన్ని బళ్ళ పిల్లలచేత గూడ నటనజేయించి