పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రెగోరీ నీసా ఈలా వ్రాసాడు. "దేవుడు అందరూ రక్షణ పొందాలనే కోరుకొంటాడు. అతడు మామూలుగా ప్రేమమార్గంద్వారా నరులను రక్షిస్తాడు. కాని కొందరికి భయమార్గానగాని రక్షణం సిద్ధించదు. అలాంటివాళ్ళు నరక యాతనలను తలంచుకొని భయపడి పాపం నుండి వైదొలగుతారు".

3.అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు. "దేవుడు నీ పాపాలను క్షమించాలంటే నీవు వాటిని అతని ముందు ఒప్పకోవాలి. పాపానికి శిక్షేమో తప్పదు. దేవుడు నిన్ను శిక్షించకుండా వుండాలంటే నీ పాపాలకు నీకు నీవే శిక్ష విధించుకోవాలి. నీ పాపాలకు నీవే న్యాయాధిపతివి కావాలి, అంతేగాని నీవు నీ పాపాలను సమర్ధిస్తూ కూర్చోగూడదు. కనుక నీకు నీవు న్యాయధిపతివికా. నీవు నీ మనసనే న్యాయస్థానం మిూదనే కూర్చో నీకు నీవే దోషివని తీర్పు చెప్పకో", ఈలా మనకు మనమే హృదయంలో పరితాపం చెందడం ఉత్తమమైన పశ్చాత్తాపమౌతుంది.

4.పాపంలో వేర్పాటు ధోరణివుంది. అది నరుణ్ణి పవిత్రుడైన భగవంతుని నుండి వేరుచేస్తుంది. ఈ వేర్పాటు ద్వారా అతనికి పెద్ద గాయం తగిలినట్లవుతుంది. అసలు అతని వనికే దెబ్బతింటుంది. దేవునినుండి విడివడిన మానవుడు తోడినరుల నుండి గూడ విడిపోతాడు. తోడినరునికి శత్రువై అతనికి హాని చేస్తాడు. ఇంకా అతడు చరాచరరూపమైన విశ్వజగత్తు నుండి కూడ వేరుపడతాడు. విశ్వాన్ని తన స్వార్ణానికి వాడుకోజూస్తాడు. పాపం యిన్ని అనర్గాలకు దారితీస్తుంది. కనుక పాపి పశ్చాత్తాపం ద్వారా అవస్యంగా దేవునితో రాజీపడాలి. లేకపోతే అతని పాపం "లోకం పాపం"తో కలసి ప్రపంచాన్ని దురితభూయిష్టం చేస్తుంది.

6. పాపోచ్చారణం

మనం మన పాపాలకు పశ్చాత్తాపపడిన పిదప పాపోచ్చారణం చేయాలి. అనగా దేవుని యెదుట వినయంతో మన పాపాలను ఒప్పకోవాలి. ఈ యధ్యాయంలో ఏడంశాలను పరిశీలిద్దాం.

1. పాపోచ్చారణం ద్వారా భగవంతుణ్ణి కీర్తిస్తాం

పాపాలకు పశ్చాత్తాపపడమంటే భగవంతుని పేమునూ కరుణనూ ఆంతరంగికంగా అనుభవానికి తెచ్చుకోవడమే. ఈ యాంతరంగికానుభవాన్ని మాటలద్వారా బయటికి చూపించాలి. అదే పాపోచ్చారణం. ఈ క్రియద్వారా భగవంతుని కరుణను ఎల్లరికినీ ప్రకటనం చేస్తాం. అతని దయను కీర్తిస్తాం. నీతిమంతులు కొరకుగాక