పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓమారు బిడ్డడు దేవుణ్ణి ప్రేమగల తండ్రిగా అర్థం చేసికొన్న పిమ్మట వాడికి దేవుని ఆజ్ఞలను గూర్చి తెలియజేయవచ్చు. రోజువారి జీవితంలో ఎలా ప్రవర్తిస్తే ఆ దేవుని ఆజ్ఞలను మిరి అతన్ని బాధపెడతామో, ఏలా ప్రవర్తిస్తే అతని మాట విని అతన్ని సంతోషపెడతామో తెలియజేయాలి. పిల్లవాడు పోకిరిపనులు చేసినప్పడు దేవుని విూరాడు కనుక పశ్చాత్తాపపడాలని కూడా తెలియజేయాలి.

ఆయా సందర్భాల్లో కుటుంబసభ్యులు ఒకరినొకరు క్షమించుకొంటూంటారు. పసిబిడ్డడు ఈ క్షమాపణను అర్థం చేసికొనేలా చూడాలి. మనం పరస్పరం క్షమించుకొన్నట్లే పరలోకంలోని తండ్రి కూడా మనలను క్షమిస్తాడని నేర్పాలి. క్రమేణ వాడికి దేవుడు మనలను క్షమించేతీరు అనుభవానికి వస్తుంది. చిన్నపిల్లలకు సువిశేషం నుండి దుడుకు చిన్నవాడి కథ, క్షమింపనొల్లని సేవకుని కథ, మంచి సమరయుని కథ మొదలైనవి బోధిస్తే మంచి ఫలితం కలుగుతుంది.

ప్రార్ధనా భావాలు

1. పాపం విషంలాంటిది. కనుక దాన్ని మన హృదయంలో దీర్ఘకాలం ఉండనీయగూడదు. పాపోచ్చారణం ద్వారా ఆ విషాన్ని ఎంత త్వరగా కక్కేసుకొంటే అంతమంచిది. పాపంద్వారా మనం పిశాచానికి దాసులమైపోతాం. మంచిని జేసే శక్తి సన్నగిల్లుతుంది. బలహీనులమైపోతాం. కనుక మనం పాపావస్థలో దీర్ఘకాలం ఉండిపోగూడదు. వీలయినంత త్వరగా మల్లా దేవుని దగ్గరికి తిరిగి రావాలి. కొంతమంది చాలనాళ్ళదాకా పాపోచ్చారణం చేయకుండా అలాగే జాప్యం చేస్తుంటారు. ఏదో పెద్ద పండుగ కొరకు వేచివుంటారు. ఇది మంచి పద్ధతి కానేకాదు. పాపవ్యాధిని ఎంతత్వరగా వదిలించుకొంటే అంత మేలు కదా? ప్రభు వరప్రసాదం మల్లా మన విూద పనిచేసి మనకు నూత్నబలమూ శక్తి ప్రసాదిస్తుంది.

2. దేవుడు మనలను శిక్షిస్తాడు, మనకు నరకం ప్రాప్తిస్తుంది, మోక్షాన్ని పోగొట్టుకొంటాం అనుకొని పశ్చాత్తాపపడితే అది అంత శ్రేష్టమైన మనస్తాపం కాదని చెప్పాం. ఐనా కొంతమంది కఠిన మనస్కులుంటారు. దేవుని ప్రేమ, దేవుని కరుణ మొదలైన భావాలు వాళ్ళ హృదయాలను అట్టే కదిలింపలేవు. అలాంటివాళ్లు దైవశిక్షకూ నరకదండనకూ భయపడి పశ్చాత్తాపపడవచ్చు. పూర్వం యోనా ప్రవక్త నినివే పౌరులు పశ్చాత్తాపపడకపోతే దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని బోధించాడు. ఆ శిక్షకు భయపడి ఆ ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. దేవుడు వాళ్ళ పరితాపాన్నిఅంగీకరించాడు - యోనా 8,10. కనుక ఇదిగూడ యోగ్యమైన పశ్చాత్తాపమే. అందుకే భక్తుడు