పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/195

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోరేది బలులు కాదు, దయాగుణం - 9,13. తోడినరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపనివాడికి, క్షమింపనొల్లని దుష్టసేవకునికి పడిన శిక్షేపడుతుంది - 18,35. ఇవన్నీ కూడ బలమైన అలోకనాలు. క్షమాపణం దేవుని లక్షణం. ఆ దేవునికి పోలికగావున్న నరుడుకూడ ఆ లక్షణాన్ని అలవర్చుకోవాలి. మనం తోడినరుడ్డి మన్నిస్తే ఆ మన్నింపు దేవుడు మనలను మన్నించాడు అన్నదానికి గుర్తుగా వుంటుంది.

పాపంద్వారా దేవునినుండి వైదొలగుతామనీ పాపోచ్చారణం ద్వారా ఆ దేవునితో మల్లా సమాధానపడతామనీ చెప్పాం. కాని మనం మన శత్రువులనుండి వైదొలగితే దేవునితో ఏలా సమాధానపడతాం? తోడినరులకు దూరమైనవాడు భగవంతునికి ఏలా దగ్గరౌతాడు? కనుక మనం పాపోచ్చారణం చేసేపుడూ, సొంతంగా పాపాలకు పశ్చాత్తాపపడి దేవుణ్ణి మన్నింపు దయచేయమని అడుగుకొనేపడూ, మన పగవాళ్ళను గూడ గుర్తుకి తెచ్చుకోవాలి. వాళ్ళకు మనమిూద వైరమున్నామనకు వాళ్ళమిూద వైరమున్నా మనం వాళ్ళను క్షమించాలి.

కొంతమంది మేము శత్రువుని క్షమిస్తాంగాని అతడు మాకుచేసిన అపకారాన్ని మర్చిపోలేము అంటారు. ఆ యపకారాన్ని మనం మర్చిపోనక్కరలేదు. కాని అతనిపట్ల ద్వేషభావాన్ని మాత్రం అణచుకోవాలి. అవసరమొచ్చినపుడు ఇతరులకు చేసినట్లే అతనికిగూడ సహాయం చేయడానికి సిద్ధంగా వుండాలి. చాలమంది క్రైస్తవుల్లో ఈ శత్రుక్షమాపణం లోపిస్తూ వుంటుంది. అలాంటివాళ్ళ ఈ విషయంలో విశేష శ్రద్ధచూపాలి. పగవాడ్డిక్షమించందే మనం క్రీస్తు శిష్యులం కాలేం. శత్రువుని క్షమించినవాడు భగవంతుని క్షమాగుణాన్ని బాగా అర్థంచేసికో గల్లుతాడు. అందుచేత మనం ఇతరులనూ క్షమించాలి, ఇతరులూ మనలను క్షమించాలి. ఈ మన్నింప ద్వారా అందరమూ భగవంతుని క్షమాపణాన్ని అనుభవానికి తెచ్చుకోగల్లుతాం.

3. చిన్నపిల్లలకు పశ్చాత్తాపపడే విధానం నేర్పడం

చిన్నపిల్లలకు పశ్చాత్తాపపడే విధానం నేర్పడం ఏలా? కొందరు తల్లిదండ్రులు దేవుడు ఓ పోలీసులాంటివాడనీ, అతడు మనలను పట్టుకొని శిక్షిస్తాడనీ తమ బిడ్డలకు నేర్పుతారు. నరకమనేది ఒకటుందనీ, మాట విననివాళ్ళను దేవుడు ఆ నరకంలోబెట్టి బాధిస్తాడనీ చెప్తారు. చిన్ననాడు ఈలాంటి భావాలను జీర్ణం జేసికొన్న బిడ్డలు పెద్దయ్యాక ఆ దేవుణ్ణి తలంచుకొని భయపడిపోతారు. ఇక అతన్ని అట్టే ప్రేమించలేరు. కనుక ఇది మంచిపద్ధతి కాదు.

తల్లిదండ్రులూ ఉపాధ్యాయులూ మొదలైన పెద్దలు తమ పిల్లలకు దేవుడు ఓ తండ్రిలాంటివాడని బోధించాలి. ఆ తండ్రి బిడ్డట్టి స్వయంగా ప్రేమిస్తున్నాడని నేర్పాలి.