పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వెంటబోయిన కుమారుడు ఇంటికి తిరిగివచ్చాక తండ్రి ఆనందించాడు-15,23. ఈ యానందాన్నే చక్కగా పశ్చాత్తాపపడినపుడు మనమూ అనుభవిస్తాం.

ఇక, మనం పాపోచ్చరణానికి వెళ్ళినపుడు మాత్రమే పశ్చాత్తాపపడితే చాలదు. మనస్తాపక్రియ ఒక్క నిమిషంలో ముగిసేది కాదు. అది మన జీవితమంతటికీ వర్తించేది. అనగా మనం రోజురోజు తేపతేపకు మన పాపాలు తలంచుకొని పశ్చాత్తాపపడుతూనే వండాలి. అసలు మనకు పశ్చాత్తాప మనస్తత్వం అలవడాలి.

“నా పాపాలు నాకు తెలుసు
నా దోషాలు ఎప్పడూ నా కన్నుల యెదుటనే వుంటాయి”

అన్నాడు కీర్తనకారుడు-51,3. ఈ భక్తునిలాగే మనంకూడ మాటిమాటికి పశ్చాత్తాపపడ్డం అలవాటు చేసికోవాలి. మనం పవిత్రులమయ్యేకొద్దీ ఈ పశ్చాత్తాప భావం ఇంకా పెరగాలి. పనీతుల్లో ఈ భావం చాల ప్రచురంగా వుండేది. పౌలులాంటి మహాభక్తుడు తన పాపాలకు జీవితాంతమూ పశ్చాత్తాపపడుతూ వచ్చాడు - 1తిమో 1,15-16.

మనం వారాంతంలో చేసే పాపోచ్చారణం మన అనుదిన పశ్చాత్తాపక్రియలను పవిత్రం చేస్తుంది, ఇది వాటి సంఖ్యనింకా అధికం చేస్తుంది. ఈ భావాలనుబట్టి భక్తులు పాపోచ్చారణానికి వెళ్ళినపుడు మాత్రమే పశ్చాత్తాపపడితే చాలదని అర్థం చేసికోవాలి.

2. తోడిజనాన్ని మన్నించాలి

దేవుడు మన పాపాలను మన్నించడానికి ఎప్పడూ సంసిద్ధంగా వుంటాడు. మన హృదయం కూడ అందుకు సిద్ధంగా వుండాలి. మనం తోడిజనాన్ని మన్నిస్తేనేగాని దేవుడు మనలను మన్నించడు. అతడు పరలోకజపంలో " మాకు అప్పపడినవాళ్ళను మేము మన్నించినట్లే మాయప్పలను విూరు మన్నించండి" అని ప్రార్థించమని చెప్పాడు. మిూరు ఇతరుల తప్పిదాలను క్షమించకపోతే పరలోకంలోని తండ్రి మిూ తప్పిదాలను గూడ క్షమించడు" అని రూఢిగా నుడివాడు - మత్త 6,12-14.

ఆ తండ్రి మంచివాళ్ళకీ చెడ్డవాళ్ళకీ గూడ తన సూర్యరశ్మినీ వరాన్నీ ప్రసాదిస్తూంటాడు. అలాగే మనం మనమిత్రులకూ శత్రువులకూ గూడ మేలుచేయడం నేర్చుకోవాలి. అప్పడే మనం ఆ దేవుడిలాంటివాళ్ళమయ్యేది - మత్త 5,44-45.

శత్రువులను క్షమించాలనే భావం సువిశేషాల్లో చాలతావుల్లో కన్పిస్తుంది. తోడిజనం పట్ల దయాగుణంతో ప్రవర్తించేవాళ్ల ధన్యులు, దేవుడు వాళ్ళకు దయజూపిస్తాడు - మత్త 5,7. మనం ఇతరులకు ఏ కొలతన కొలిస్తే దేవుడు కూడ మనకు అదే కొలత కొలుస్తాడు - 7,2. పూర్వవేదంలోని తండ్రిలాగే నూత్నవేదంలోని క్రీస్తు ప్రధానంగా