పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2)పాపాన్ని అసహ్యించుకోవడం. మనపాపాలు దేవునికి అప్రియం కలిగిస్తాయి. కనుక మనం వాటిని అసహ్యించుకోవాలి. ఈ యసహ్యభావం మనం చేసిన చావైన పాపాలన్నిటికీ, స్వల్పపాపాలకీ గూడ వర్తించాలి.

మామూలుగా మనం కొన్ని మూల పాపాలవల్ల చాల చిల్లరమల్లర పాపాలు చేసూంటాం. ఉదాహరణకు అహంకారం అనే మూలపాపంవల్ల చాలరకాల పాపాలు చేస్తాం. అలాగే స్వార్థం, సోమరితనం అనే మూలపాపాలవల్లా కానిపనులు ఏవేవో చేస్తాం. ఇక మనం పశ్చాత్తాపపడేపుడు ఈ మూల పాపాలకు ఎక్కువగా పశ్చాత్తాపపడాలి. మన మూలపాపాలేమిటివో మనకు తెలిసివుండాలి కూడ.

పాపమంత చెద్దది మరొకటి లేదు. అంత చెద్దదైన పాపానికి పాల్పడ్డాం గనుక మనం అనుభవించే పశ్చాత్తాపం గూడ చాల లోతుగా వుండాలి.

కొంతమంది పాపోచ్చారణానికి తయారయ్యేపుడు మోక్షవాకిలి మొదలైన జపపుస్తకాల్లో నుండి ఏవేవో అచ్చుజపాలు వల్లెవేస్తుంటారు. అంతకంటె ఉత్తమమైన పద్ధతి, మనసులో పశ్చాత్తాపపడి హృదయంలో నుండి పశ్చాత్తాపభావాలను వెలిబుచ్చడం.

3) మళ్ళా అలాంటి పాపాన్ని చేయమని నిశ్చయించుకోవడం. ఓమారు మన పాపాలకు యథార్థంగా పశ్చాత్తాపపడితే మళ్ళా అలాంటి పాపాలు చేయకూడదని సంకల్పించుకొంటాం గదా? మన తరపున మనం ఆ పాపాలను మల్లా చేయకూడదని మనసులో గట్టిగా ప్రమాణం చేసికోవాలి. ఒకవేళ బలహీనతలవల్ల మళ్ళా అదే పాపంలో పడిపోతే మనకు చిత్తశుద్ధి లోపించినట్లుకాదు.

గట్టి ప్రమాణం అంటే మన పాపాలవల్ల ఇతరులకు కల్గిన నష్టాలను మనం కొంతవరకైనా తీర్చే ప్రయత్నం చేయాలి. జక్కయ అలా చేసాడు. కనుకనే అతనిది చిత్తశుద్ధి గల మనస్తాపమైంది — లూకా 19,8. ఇంకా గట్టి ప్రతిజ్ఞ అంటే మనం పాపావకాశాలను తొలగించుకోవడానికిగూడ సిద్ధంగా వుండాలి. ఉదాహరణకు కొందరు స్నేహితులు కాని కొన్ని పుస్తకాల పఠనంకాని మన అపవిత్ర జీవితానికి కారణమైనప్పడు మనం ఆ స్నేహితులనూ ఆ పుస్తక్షాలనూ పరిత్యజించాలి.

మనం పశ్చాత్తాపపడేపుడు క్రీస్తుసిలువను భరిస్తాం, అతని పాటుల్లో పాలు పొందుతాం. కాని ఆ పశ్చాత్తాపం ముగిసాక క్రీస్తు ఉత్థానంలో పాలుపొంది సంతోషిస్తాం. నిజమైన మనస్తాపం తప్పకుండా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. లూకా సువివేషం 15వ అధ్యాయంలో మూడు కథలున్నాయి. అవి తప్పిపోయిన గొర్రె, జారిపోయిన నాణెం, దేశాలవెంటబోయిన కుమారుడు. తప్పిపోయిన గొర్రె దొరికాక దాని కాపరి ఆనందించాడు15, 5. జారిపోయిన నాణెం దొరికాక పేదరాలు ఆనందించింది -159. దేశాల