పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమలులోకి వచ్చింది. ఈదశలో ఏపాపానికి యెంత ప్రాయశ్చిత్తం చెల్లించాలో సూచించే పుస్తకాలు వాడుకలో వుండేవి. వాటిప్రకారం గురువులు పాపులకు ప్రాయశ్చిత్తం విధించేవాళ్లు, ఈకాలంలో ల్యాటిను శ్రీసభలో పాపులు గురువులు దొరకనప్పుడు గృహస్తులకు కూడ పాపోచ్చారణం చెప్పేవాళ్లు, ఈ సంప్రదాయం 16వ శతాబ్దంలో బ్రెంటు మహాసభ జరిగిందాకాగూడ అడపాదడపా వాడుకలో వుండేది. భక్తిపరులైన గృహస్తులకు పాపోచ్చారణం చేయడమనేది గ్రీకు శ్రీసభలో రెండవ శతాబ్దంనుండే ప్రచారంలో వుండేది. అలెగ్జాండ్రియా క్లెమెంటు ఈ వదంతాన్ని పేర్కొన్నాడు.

3.మూడవదశ - ప్రస్తుత పాపోచ్చారణ విధానం

పై రెండవదశలోని వ్యక్తిగతమైన పాపోచ్చారణ విధానమే 9వ శతాబ్దానికల్లా స్థిరపడి శ్రీసభ అంతటా అమలులోకి వచ్చింది. ఈదశలో గురువులు పుస్తకాలు నియమించే పద్ధతిని బట్టికాక, తాము సొంతంగానే ప్రాయశ్చిత్తాన్ని నిర్ణయించేవాళ్లు, పాపులు ఆ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించేవాళ్ళు పాపోచ్చారణం రహస్యమూ వ్యక్తిగతమూ ఐన విధిగా మారిపోయింది. గురువు పాపినిగాని అతని పాపాలనుగాని వెల్లడి చేయకూడదనే కఠిన నియమం కూడ అమలులోకి వచ్చింది.

ఈ విధానమే తరువాతి శతాబ్దాల్లోకూడ కొనసాగుతూ వచ్చింది. 1215లో ల్యాటరన్ మహాసభ ఈ వ్యక్తిగతమైన పాపోచ్చారణను శ్రీసభ కంతటికీ వర్తింపజేస్తూ శాసనం చేసింది. పైగా ప్రతి క్రైస్తవుడూ తన పెద్ద పాపాలకు సంవత్సరానికి ఒక్కసారైనా పాపోచ్చారణం చేయాలనీ, గురువులు పాపోచ్చారణ రహస్యాలను వెల్లడి చేయకూడదనీ కట్టడలు కూడ చేసింది.

16వ శతాబ్దంలో లూతరు మొదలైన ప్రోటస్టెంటు నాయకులు పాపాలను గురువుతో చెప్పనక్కరలేదనీ, పాపి వ్యక్తిగతంగా దేవుని యెదుట పశ్చాత్తాపపడితే చాలుననీ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ట్రెంటుమహాసభ ఈ ప్రోటస్టెంటు వాదాన్ని ఖండించింది. శ్రీసభలో పూర్వం నుండి ఆచారంలో వున్నట్లుగా పాపులు తమ పాపాలను గురువునెదుట ఒప్పకోవాలని ఆజ్ఞాపించింది. ఈ ట్రెంటు మహాసభ ఆజ్ఞ మన క్యాతలిక్ సమాజంలో ఈనాటికీ చెల్లుతుంది.

తొలిదశలోని బహిరంగ విధిలో లాగ నేటి వ్యక్తిగతమైన పాపోచ్చారణ విధిలో శ్రీసభపాత్ర అంత ప్రస్ఫుటంగా గోచరించదు. ఐనా ఇది వ్యక్తిగతమైన విధి కనుక విశ్వాసులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ విధిని విశ్వాసులు ఎన్నిసార్లు అవసరమైతే