పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదుకొంటూండేవాళ్ళకూడ. 4. పాటులవారంలో వచ్చే పెద్ద బేస్తవారంనాడు ఈ పాపుల బృందాన్ని ప్రదక్షిణంతో దేవాలయంలోకి తీసికొనివచ్చేవాళ్ళు పూజలో సువిశేష పఠనం ముగిసాక పీఠాధిపతి వాళ్ళకు దేవునితోను, తోడి విశ్వాసులతోను పునస్సమాధానం కలిగించేవాడు. అతడు దేవుడు వాళ్ళ పాపాలను మన్నించాలని విశ్వాసులందరి తరపున ప్రార్ధనం చేసేవాడు. పాపుల పరిహారాన్ని పొంది పూజలో దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించేవాళ్ళు. ఇది బహిరంగమూ సామూహికమూ ఐన పాపోచ్చారణ విధి.

ఈ తంతుతో శ్రీసభ పాత్ర బాగా గోచరమయ్యేది. పాపులు శ్రీసభతో సమాధానపడితేనేగాని దేవునితో సమాధానపడరనే భావం స్పష్టమయ్యేది. పీఠాధిపతి ప్రముఖపాత్రను నిర్వహించేవాడు. పాపపరిహారాన్ని సంపాదించిపెట్టేది ప్రధానంగా పవిత్రాత్మ అనే భావంకూడ వ్యక్తమౌతుండేది.

ఈ బహిరంగ విధిలో పాల్గొనడానికి మామూలుగా పాపులు వాళ్ళంతట వాళ్లే ముందుకి వచ్చేవాళ్లు, కాని గురువులూ మిత్రులూ పాపులను ప్రోత్సహించి వాళ్ళను ఈతంతులో పాల్గొనేలా చేయడంగూడ కొంతవరకు వుండేది. ఈ తంతులో పాపులు మొదట తమ పాపాలను వ్యక్తిగతంగాను రహస్యంగాను గురువుకి విన్నవించుకొనేవాళ్లు, గురువులు ఆ పాపాలను వెల్లడి చేయకూడదనే కట్టడకూడ వుండేది. ఈ యాజ్ఞను విూరిన కొందరు గురువులను 5వ శతాబ్దంలో పెద్దలియో పాపుగారు నిశితంగా మందలించారు కూడ. కొన్ని పర్యాయాలు పాపులు తామే స్వయంగా తమ పాపాలను బహిరంగంగా ఒప్పకోవడం గూడ జరిగేది.

పాపులు ఈలాంటి బహిరంగ పాపోచ్చారణ విధిలో తమ జీవితంలో ఒక్కసారి లేక రెండుసార్లు మాత్రమే పాల్గొనేవాళ్ళ అందుకే కొందరు పాపులు తమ జీవితాంతంలో మాత్రమే ఈ వీధిలో పాల్గొనేవాళ్లు ఈలా ఓసారి బహిరంగమైన తంతులో పాల్గొన్నాక మళ్ళా పాపాలు చేస్తే ఇక వాటికి పరిహారం వుండదనే భావం గూడ ఆనాడు ప్రచారంలో వుండేది. ఇంకా, పెద్దపాపాలుచేసి ఇతరులకు దురాదర్శం చూపించినవాళ్లు మాత్రమే ఈ తంతులో పాల్గొనేవాళ్లు

2. రెండవదశ - వ్యక్తిగతమైన పాపోచ్చారణం

కాలక్రమేణ పై బహిరంగ పాపోచ్చారణవిధి అడుగంటిపోయింది. దానిస్థానే వ్యక్తిగతమైన పాపోచ్చారణం ప్రచారంలోకి వచ్చింది. దీన్ని మొదట 6వ శతాబ్దంలో ఐర్లండులోని సన్యాసమరాలు ప్రారంభించాయి. అక్కడినుండి ఈ విధానం ఇంగ్లండుకీ యూరపుకీ ప్రాకింది. ఎన్మిది తొమ్మిది శతాబ్దాలకల్లా ల్యాటిన్ శ్రీసభ అంతటా ఈ పద్ధతి