పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేదసాక్షియైన అంటియోకయ ఇన్యాసివారు 107 ప్రాంతానికి చెందినవాడు. అతడు పాపోచ్చారణం వలన దేవునితోను స్థానిక పీఠాధిపతితోను పునస్సమాధానం కలుగుతుందని వ్రాసాడు.

200 ప్రాంతంలో టెరూలియను అనే వేదశాస్త్రి ఈ పుణ్యక్రియను గూర్చి వ్రాస్తూ పాపోచ్చారణమనేది పాపిహృదయానికి సంబంధించిన క్రియయైనా అతడు దాన్ని బహిర్గతంగా వ్యక్తం చేయాలనీ అప్పుడు శ్రీసభ తన ప్రార్థనతోను సానుభూతితోను అతనికి సహాయం చేయగల్లుతుందనీ వాకొన్నాడు.

210లో అలెగ్జాండ్రియా క్లెమెంటు కొందరు భక్తులు పాపలను పాపోచ్చారణానికి సిద్ధం చేస్తున్నారని వ్రాసాడు. వాళ్లు తమ ప్రార్ధనలద్వారాను సలహాలద్వారాను పాపులకు సహాయపడుతున్నారని చెప్పాడు. పాపాలను ఆలించే గురువు కూడ ఈ సహాయుల్లాగే మెలగాలని సూచించాడు.

253లో ఓరిజన్ అనే వేదశాస్తి పాపోచ్చారణాన్ని గూర్చి మాట్లాడుతూ విశ్వాసులందరూ కలసి పాపిని పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధంచేయాలనీ, కడన పీఠాధిపతి అతని పాపాలను మన్నిస్తాడనీ చెప్పాడు. అతడు పీఠాధిపతిని పాపికి చికిత్సచేసే వైద్యునితో పోల్చాడు.

నాల్గవ శతాబ్దంలో భక్తుడు ఆంబ్రోసు పాపోచ్చారణమూ పాపక్షమాపణమూ ఆత్మద్వారా జరిగే క్రియలని వాకొన్నాడు.

ఐదవ శతాబ్దానికల్లా బహిరంగమైన పాపోచ్చారణ విధి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ విధిలో చాలా అంశాలున్నాయి. 1. నరహత్య వ్యభిచారం, మతపరిత్యాగం మొదలైన పెద్దపాపాలు చేసినవాళ్ళ జాబితాను సిద్ధం చేసేవాళ్ళ వాళ్లు మొదట గురువుకి వ్యక్తిగతంగా పాపోచ్చారణ చేసేవాళ్లు, తరువాత తపస్సుకాలంలో వచ్చే విబూది బుధవారంనాడు పీఠాధిపతి గురువు విశ్వాసులు మొదలైనవాళ్ళందరి ముందు ఆ పాపులు పాపాత్ములబృందంలో చేరేవాళ్లు, 2. పీఠాధిపతి అందరిముందు ఆరాధన సమాజంనుండి వాళ్ళను బహిష్కరించేవాడు. ఇకవాళ్ళు పూజలో పాల్గొనగూడదు. దివ్యసత్రసాదం పుచ్చుకోగూడదు. పాపంద్వారా శ్రీసభకు ద్రోహం చేసారు కనుక వాళ్ళను శ్రీసభనుండి వెలివేయడం జరిగేది. 3. ఆ పాపులు తపస్సు కాలమంతా తమ పాపాలకు ప్రాయశ్చిత్తం . ప్రార్ధన చేసికోవడం, దానధర్మాలు చేయడం, ఉపవాసముండడం, సొంతంగా నిర్ణయించుకొన్న హింసీకరణ కర్మలను పాటించడం మొదలైనవి ఈ ప్రాయశ్చిత్తంలో భాగాలు. ఈ తపస్సుకాలంలో శ్రీసభ సభ్యులు వాళ్ళను మందలిస్తుండేవాళ్లు, వాళ్ళకు హితోక్తులు బుద్ధిమతులు చెప్తుండేవాళ్లు, తమ సదాదర్శంతోను ప్రార్థనలతోను వాళ్ళను