పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26,62, సుంకరి - 18,13, జక్కయ - 19,8-9, పాపాత్మురాలు - 7,47, దుడుకు చిన్నవాడు-15,21, మంచి దొంగ -23,42-43.

4. సొలోమోనురాజు దేవాలయాన్ని నిర్మించి దానికి ప్రతిష్ట చేయించినపుడు గొప్ప ప్రార్థన చేసాడు. ప్రజలు ఆ దేవళానికి వచ్చి ప్రభువుని స్తుతించి క్షమాపణం అడుగుకొంటే ప్రభువు వాళ్ళ తప్పిదాలను మన్నించాలని ప్రార్ధించాడు - 1రాజు 8,33–34 ఆ రాజు ఆశించినట్లే మనం దేవళంలోనికి వెళ్ళి మన తప్పిదాలను మన్నించమని ఆ ప్రభువుకి మొరపెట్టుకోవాలి.

మూస:CENTER

ఇప్పడు మన క్యాతలిక్ సమాజంలో వ్యక్తిగతంగా గురువుతో పాపోచ్చారణం చేస్తాం. ప్రోటస్టెంటు సమాజాల్లో ఈ సంప్రదాయం వుండదు. అందువల్ల మనవాళ్లు పాపోచ్చారణమనేది శ్రీసభ చరిత్రలో మొదటినుండి వుందా అని అడుగుతుంటారు. కనుక పాపోచ్చారణ చరిత్రను క్షుణ్ణంగా తెలిసికొని వుండడం అవసరం. ఈ సంస్కారం చరిత్రలో మూడు దశలున్నాయి. మొదటిది 1-6 శతాబ్దాల వరకు. రెండవది 6నుండి 8వ శతాబ్దం వరకు. మూడవది 9వ శతాబ్దం నుండి ప్రస్తుతకాలం వరకు. ఇక ఈ దశలను క్రమంగా పరిశీలిద్దాం.

1. మొదటిదశ : బహిరంగ పాపోచ్చారణం

మొదటి శతాబ్దానికి చెందిన హెర్మసు అనే రచయిత పాపాన్నీ పశ్చాత్తాపాన్నీ పేర్కొన్నాడు. అతని భావాల ప్రకారం శ్రీసభను ఓ గోపురంలా నిర్మిస్తారు. పుణ్యాత్ములు ఈ గోపురాన్ని కట్టడానికి వుపయోగపడే రాళ్ళలాంటివాళ్ళు ఈ కట్టడానికి పనికిరావని విసర్జించిన రాళ్ళలాంటివాళ్ళ పాపాత్ములు. ఐనా ఆ పాపాత్ములు పశ్చాత్తాపపడితే తాముగూడ గోపురాన్ని కట్టడానికి పనికివచ్చేరాళ్లు ఔతారు.

మొదటి శతాబ్దానికే చెందిన డిడాకే అనే గ్రంథం పాపోచ్చారణాన్ని పేర్కొంటుంది. ఈ క్రియద్వారా నరుడు ప్రార్థన చేసికోవడానికి, దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించడానికీ యోగ్యుడవుతాడని గ్రంథం చెప్తుంది.

ఇదే కాలానికి చెందిన వేదసాక్షి స్మిర్నా పోలికార్పు ఈ సంస్కారాన్ని గూర్చి వ్రాస్తూ పెద్దలు కరుణతో పాపాలు మన్నించాలనీ వాళ్ళకూడ పాపభారం కలవాళ్లే కనుక ఇతరుల పాపాలను సానుభూతితో అర్థంచేసికోవాలనీ నుడివాడు.