పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. మన దృష్టిలో శ్రీసభ అధికారపూర్వకంగా పాపోచ్చారణ సంస్కారాన్ని నిర్వహిస్తుంది. శ్రీసభ దేవుని కృపతో అధికారపూర్వకంగా మన పాపాలను మన్నిస్తుంది, ప్రోటస్టెంటులు ఈలాంటి అధికారాన్ని దేన్ని అంగీకరించరు. వాళ్ళ భావాలప్రకారం వాక్యాన్ని ప్రకటించినపుడు పాపి హృదయంలో విశ్వాసం జనిస్తుంది. ఈ విశ్వాసమే అతని పాపాలను మన్నిస్తుంది. అంతేగాని ఎవరూ అధికారపూర్వకంగా ఎవరి పాపాలనూ మన్నించరు.

2. మన దృష్టిలో పాపోచ్చారణ సంస్కారం పాపి పాపాలను హరిస్తుంది. పాపి పశ్చాత్తాపమూ, పాపోచ్చారణమూ, ప్రాయశ్చిత్తం చెల్లించడం అనేక్రియలుకూడ అతని పాపపరిహారానికి తోడ్పడతాయి. ప్రోటస్టెంటుల దృష్టిలో పాపోచ్చారణ సంస్కారం పాపి పాపాలను మన్నించదు. అసలు అది సంస్కారమే కాదు. వాక్యాన్ని ప్రకటించినపుడు హృదయంలో విశ్వాసం పడుతుంది. ఈవిశ్వాసమే అతనికి పాపపరిహారం చేసిపెడుతుంది. పాపి పశ్చాత్తాపము మొదలైన క్రియలు పాపాన్ని ఎంతమాత్రం పరిహరించలేవు.

3. మన దృష్టిలో పాపాలను మన్నించేది గురువు. ఆ గురువు కూడ పీఠాధిపతినుండి అధికారం పొందివుండాలి. ప్రోటస్టెంటుల దృష్టిలో ఒక్క గురువేకాదు ఎవరైనా పాపపరిహారక్రియలో తోడ్పడవచ్చు. గృహస్తులు స్త్రీలు పిల్లలు మొదలైన వాళ్ళు కూడా ఈలా తోడ్పడవచ్చు.

మూస:CENTER

1. మనం ఒకోసారి పెద్దపాపాలు చేస్తాం. ఆ విూదట దేవుడు మన పాపాలను క్షమిస్తాడోలేదో అని శంకిస్తాం. నిరాశ చెందుతాం. ఆత్మహత్యకు కూడ పాల్పడతాం. పూర్వం యూదా ఈలాగే చేసాడు - మత్త 26,3-5. కాని ఇది పొరపాటు. దేవుడు క్షమించని పాపాలు మనమేమీ చేయలేం. పశ్చాత్తాపపడితే చాలు ఎంత పెద్ద తప్పకైనా పరిహారం వుంటుంది.

2. రక్షణాన్ని పొందాలంటే పశ్చాత్తాపం అవసరం. "నీవు పాపిని హెచ్చరించినా అతడు పరివర్తనం చెందకపోతే ఇక అతడు పాపిగానే చనిపోతాడు” అని పల్మాడు ప్రభువు యెహెజ్కేలు ప్రవచనంలో - 33,9. కనుక పశ్చాత్తాపం లేందే మోక్షప్రాప్తి ඒක.

3. సువిశేషం పరివర్తనం చెందిన భక్తులను చాలామందిని పేర్కొంటుంది. వాళ్ళంతా పశ్చాత్తాపంలో మనకు ఆదర్శంగా వుంటారు. ఉదాహరణకు పేత్రు - లూకా