పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇక, ఇక్కడ క్రీస్తు యూదుల సంప్రదాయాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడాడు. ఆ యూదుల రబ్బయిలు యూదసమాజంలోలాగే, పండ్రెండుమంది శిష్యులు కూడ క్రైస్తవసమాజంలో కొందరి పాపాలను బంధిస్తారు. అనగా ఆ పాపాలకు మన్నింప వుండదు. కొందరి పాపాలను విప్పతారు. అనగా ఆ పాపాలకు మన్నింపు వుంటుంది. పాపాలను మన్నించడంలో )סרk( మన్నింపకపోవడంలోగాని శిష్యులకు పూర్తి అధికారం వుంది. ఇక శిష్యుల అధికారాన్నివాళ్ళ అనుయాయులైన పోపుగారు మేత్రాణులు గురువులు మొదలైన వాళ్ళంతా పొందుతారు. నేటి మన పాపోచ్చారణ సంస్కారానికి ఇది ఓ ఆధారవాక్యం.

యూదరబ్బయిలు నిషేధాలతో కొందరిని యూద సమాజంనుండి బహిష్కరించేవాళ్ల పై అనుమతులతో వాళ్లను మళ్ళాయూదసమాజంలోకి రానిచ్చేవాళ్ళ ఈలాగే తొలి క్రైస్తవ సమాజంలో పోపుగార్లు మేత్రాణులు మొదలైన అధికారుల పాపులైన క్రైస్తవులను ఆరాధన సమాజం నుండి బహిష్కరించారు. వాళ్లు పూజలో పాల్గొనగూడదు, సత్రసాదం పుచ్చుకోగూడదు. ఈ పోపులు తమ పాపాలకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసికొన్నాక ఆరాధన సమాజంలోనికి పునఃప్రవేశించవచ్చు. అప్పడు ఆ విశ్వాసులు పూజలో పాల్గొని సత్రసాదం పుచ్చుకొనేవాళ్లు, ఈలా బహిష్కరణమూ పునఃప్రవేశమూ అనేవి యూదసమాజానికీ తొలినాటి క్రైస్తవ సమాజానికీ గూడ వర్తించేవి. ఇప్పటి క్రైస్తవ సమాజంలో ఇవిలేవు.

2. ఉత్థాన క్రీస్తు శిష్యులతో "మికు సమాధానం కలగాలి. తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మపంపుతున్నాను" అని చెప్పాడు. అలా చెప్పి వారి మిూద తన శ్వాసను ఊది "పవిత్రాత్మను పొందండి. విూరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి క్షమింపబడతాయి. ఎవరి పాపాలు క్షమింపరో అవి క్షమించబడవు" అని పల్మాడు - యోహా 20,21-23. నేటి మన పాపోచ్చారణ సంస్కారానికి ఇదికూడ ఓ ఆధారవాక్యం.

ఈ వాక్యం భావం ఇది. తండ్రి క్రీస్తుని ఉత్తానంచేసి అతనిద్వారా నరుల పాపాలను మన్నించాడు. ఈ మన్నింపు వల్లనే నరులకు సమాధానం కలిగింది. పాపాలను పరిహరించడానికే క్రీస్తు విచ్చేసాడు - 1యోహా 3,5. క్రీస్తు తన తరపున తాను శిష్యులద్వారా ఈ పాపపరిహారమనే కార్యాన్ని కొనసాగించుకొంటూ పోతాడు. కనుక తండ్రి తన్ను పంపితే, తన తరపున తాను శిష్యులను పంపుతున్నాడు. తండ్రి క్రీస్తులో వుండి నరులపాపాలను క్షమిస్తాడు. అలాగే యిప్పడు క్రీస్తు శిష్యుల్లో వుండి ప్రజల పాపాలను క్షమిస్తాడు. ప్రభువు శిష్యులమిూదికి పవిత్రాత్మను ఊదాడు. పాపపరిహారం జరిగేదీ నూత్నజీవం నెలకొనేదీ ఈయాత్మ ద్వారానే. కనుక శిష్యులు ఆత్మసాన్నిధ్యంతో నరుల పాపాలను మన్నించి వాళ్ళకు క్రొత్త జీవాన్ని దయచేస్తారు. ఆత్మద్వారా పాపపరిహారం