పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. చాలమంది తప్పజేసికూడ తోడి నరుల యెదుట ఆ తప్పని ఒప్పకోరు. అలాగే కొందరు దేవుని యెదుట కూడ తమ తప్పని ఒప్పుకోరు. ఇది చాల చెడ్డపద్ధతి. దావీదు బత్తెబాతో పాపం చేసాడు. నాతాను ప్రవక్త అతన్ని మొగంవాచేలా చీవాట్ల పెట్టాడు. వెంటనే దావీదు బుద్ధితెచ్చుకొని నేను ప్రభువుని ధిక్కరించి పాపం చేసాను అని పల్కి పశ్చాత్తాపపడ్డారు - 2సమూ 12,13. మనం పాపాన్ని ఒప్పకోవలసిన తీరు ఇది.

6. మన తరపున మనం పాపులైన తోడినరులను ఏలాంటి పరిస్థితుల్లోను అసహ్యించుకోగూడదు. వాళ్ళను సానుభూతితో అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. వాళ్ళలోని పాపగుణాలే మనలో గూడ వున్నాయి. కనుకనే అసిస్సీ ఫ్రాన్సిస్ భక్తుడు ఓ పర్యాయం ఉరికంబమెక్కిన ఓ దోషిని జూచి “దేవుని అనుగ్రహమేగనక లేకపోతే నేడు ఫ్రాన్సిస్ గూడ ఇదే స్థానంలో ఉండేవాడే" అని పల్మాడు.

మూస:CENTER

నరుడు దేవుణ్ణి ధిక్కరించి పాపం చేస్తుంటాడు. కాని ప్రభువు అనుగ్రహం అతని కండ్లు తెరిపిస్తుంది. అతడు పశ్చాత్తాపపడతాడు. భగవంతుడు కోరుకొనేది కూడ నరుడు పశ్చాత్తాపపడాలనే. ఈ యధ్యాయంలో పశ్చాత్తాపాన్ని పరిశీలించి చూద్దాం. ఇక్కడ మూడంశాలు ప్రస్తావిద్దాం.

1. పశ్చాత్తాపాన్ని గూర్చిన బైబులు బోధలు

1. పాపంద్వారా నరుడు దేవుణ్ణి ధిక్కరిస్తాడనీ దేవుని నుండి దూరంగా వైదొలగిపోతాడనీ చెప్పాం. పశ్చాత్తాపం ద్వారా అతడు నరులతో ప్రేమతో నిబంధనం చేసికొన్న దేవుని దగ్గరికి మళ్ళా తిరిగివస్తాడు. పూర్వం తాను ఏతండ్రి యింటినుండి వెళ్ళిపోయాడో ఆ యనురాగపు తండ్రి యింటికి తిరిగి వచ్చి అతనితో రాజీపడతాడు. దుడుకుచిన్నవాడు ఇందుకు చక్కని నిదర్శనం. ఆ దుడుకుచిన్నవాడిలాగే పాపి గూడ తండ్రియైన దేవుని దగ్గరికి మరలివచ్చి తన పాపాన్ని ఒప్పకొంటే అది మంచి పశ్చాత్తాపమౌతుంది. కీర్తనకారుడు కూడ“దేవా! నా పాపాన్ని నీయెదుట ఒప్పకొన్నాను. నేను నా దోషాన్ని కప్పిపెట్టుకోలేదు. నేను నా పాపాలను దేవునికి విన్నవించుకొంటాను అనుకొన్నాను. కనుక నీవు నా యపరాధాలను మన్నించావు" అని పల్మాడు — 32,5.

2. యూదులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొనేపడు కొన్ని బాహ్య క్రియలద్వారా పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చేవాళ్లు, అవి ఉపవాసముండడం, గోనెపట్ట