పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. పాపంలోని సామూహిక గుణం

ప్రసాదు చేసిన పాపం ప్రసాదుని బాధిస్తుంది. కాని అతని పాపం సమాజాన్ని గూడ బాధిస్తుంది. కనుక పాపంలో వ్యక్తిగతమైన గుణం మాత్రమే కాక సామూహిక గుణంకూడ వుంది. అసలు ఆది తల్లిదండ్రులు చేసిన తొలి పాపంలోనే ఈ శక్తి కనిపిస్తుంది. ఆదిదంపతుల పాపం వాళ్ళను మాత్రమేకాక మనలనుగూడ నాశం చేసిందికదా! మనమంతా పాపపు నరజాతికి చెందినవాళ్లం. మనపాపాలతో ఒకరినొకరం బాధించేవాళ్ళం. తొలి జన్మపాపానికి మన సొంతపాపాలను గూడ చేర్చి లోకాన్ని పాపభూయిష్టం చేసేవాళ్లం. కనుకనే పౌలు ఈ లోకం పాపంలో మునిగి తేలుతున్నట్లుగా భావించాడు. ఈ పాపభారాన్ని తప్పించుకోవడానికి ప్రపంచం ప్రసవవేదన పడుతున్నదని చెప్పాడు - రోమా 8,19-22,

లోకంలో సామూహిక పాపమనేది కూడ వుందని చెప్పాం. దీనికే "లోకపు పాపం" అని పేరు - యోహా 1,29. దీనివల్ల మానవతా విలువలూ నైతిక విలువలూ నాశమై పోతున్నాయి. ఉదాహరణకు నేడు లోకం లైంగిక భావాలను విరివిగా ప్రచారం చేస్తూంది. ఈలాంటి వాతావరణంలో మన యువతీయువకులు విశుద్ధ జీవితం ఏలా జీవించగల్లుతారు? ఎక్కడ జూచిన అవినీతి తాండవిస్తూంది. ఈలాంటి పరిస్థితుల్లో మంచి ఉద్యోగికి కూడ దుర్బుద్ధి పడుతుంది. సంపన్నదేశాలు పేదదేశాలనూ, ధనికవర్గాలు పేదప్రజలనూ పీడించి పిప్పి చేస్తున్నాయి. అలాంటప్పుడు పేదలు తిరుగుబాటు చేయకుండా ఏలా వుంటారు? అసలు మనమందరమూ అన్యాయానికి దోపిడికి పాల్పడే వాళ్ళమే. మనలో ప్రతివాడూ ఆయా వస్తువులను దొంగిలిస్తాడు, సాంతానికి వాడుకొంటాడు, దాచి పెట్టుకొంటాడు, దుర్వినియోగం చేస్తాడు, నాశం చేస్తాడు. ఈ పాపాలన్నీ సమాజంమిూద సోకుతాయి.

అసలు పూర్తిగా వ్యక్తిగతమైన పాపమనేది లేనేలేదు. మనంచేసే ప్రతి పాపంకూడ కొంతవరకైనా తోడి జనాన్ని బాధిస్తుంది. ఉదాహరణకు, మన హృదయంలో వుండే ద్వేషభావాలు కేవలం మన వ్యక్తిగతమైన పాపాలు అనుకొంటాం. ఐనా వాటిద్వారా మనం మన చుట్టుపట్లవుండే సమాజానికి హాని తలపెడుతున్నాం. కనుక మన ద్వేషభావాల ప్రభావం సమాజం విూద కూడ వుంటుంది. ప్రతిపాపమూ ఈలాగే. మనం గుర్తించినా గుర్తించకపోయినా మానవజాతి అంతా ఒక్కసమాజం, ఒక్క దేహం. ఈ సమాజంలో ఒకరి పాపం మరొకరిమిూద సోకుతుంది. ఒకరి పుణ్యం గూడ మరొకరి విూద సోకుతుంది.

మనం చేసే ప్రతి పాపము తోడి జనంలో వసించే క్రీస్తుని మల్లాసిలువ వేస్తుంది. ఈ తోడి జనమే శ్రీసభ. కనుక పాపియైనవాడు శ్రీసభద్వారా దేవునినుండి మన్నింపు