పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కనుక మనం గురువుతో పాపాలు ఎందుకు చెప్పాలి అన్నప్రశ్నకు సమాధానం ఇది. అతన్ని ఓ వ్యక్తినిగా గాక శ్రీసభ ప్రతినిధిగా గుర్తించాలి. ఆ శ్రీసభ యెదుట, దాని ప్రతినిధియైన గురువు నెదుట మన పాపాలు చెప్పకోవాలి. ఎందుకంటే మన పాపాల ద్వారా ఆ శ్రీసభను బాధిస్తాంగనుకనూ, ఆ శ్రీసభ తన ప్రార్థనల ద్వారా మనకు పశ్చాత్తాప వరాన్ని సంపాదించి పెడుతుంది కనుకనూ, ఆ శ్రీసభలో మనంకూడ భాగం కనుకనూ,

ఈ సందర్భంలో తిరుసభ ప్రతినిధులుగా వుండి పాప పరిహారాన్ని దయచేసే గురువులను గూర్చి గూడ ఒకటిరెండు మాటలు చెప్పాలి. గురువులు కూడ పాపులే. వాళూపరివర్తనం చెందాలి, వాళ్ళ తమ యోగ్యత ద్వారా గాదు, గురుపట్ట సమయంలో ఆత్మప్రసాదించిన దివ్యశక్తి ద్వారా ఈనాడు నరుల పాపాలను పరిహరింపగల్లుతున్నారు. గురువు ఓ మంత్రదండంతో మాంత్రికంగా, యాంత్రికంగా విశ్వాసుల పాపాలు పరిహరించడు. ప్రభువు శ్రీసభలో ఏర్పాటు చేసిన యాజక పరిచర్య ద్వారా అతనికా దివ్యశక్తి లభిస్తుంది. అదే శక్తిద్వారా గురువు తాను గూడ ఇతర గురువుల నుండి పాపపరిహరం పొందుతుండాలి. పూర్వం పేత్రు పడిపోయి లేచిన తర్వాత మందకు కాపరి అయ్యాడు. వినయంతో గూడిన పశ్చాత్తాపం అతన్ని ఆ పదవికి తయారుచేసింది. ఆ పేత్రు లాగే నేటిగురువులు కూడ చాలసార్లు పడిపోతూంటారు. ఐనా వాళ్లు ఆ పేత్రులాగే పశ్చాత్తాపపడి హృదయశుద్ధిని పొంది పాపపరిహార పదవిని మరింతయోగ్యంగా నిర్వహిస్తూంటారు. తమలాగే తోడినరులు కూడ బలహీనప ప్రాణులని అనుభవపూర్వకంగా అర్థం చేసికొంటారు. వాళ్ళపట్ల సానుభూతిని చూపుతారు. కనుక పాపపరిహారాన్ని దయచేసే గురువు వీళ్లు పాపులు అన్నట్లుగా విశ్వాసులను చిన్నచూపు చూడగూడదు. ఆ పాపుల్లో తానూ ఒకణ్ణి అనుకొంటుండాలి. విశ్వాసుల కష్టాలు శోధనలు బలహీనతలు మొదలైనవాటిపట్ల కొండంత సానుభూతి చూపుతూండాలి. ఇక విశ్వాసులు తమతరపున తాము గురువులో శ్రీసభ ప్రతినిధినీ క్రీస్తుప్రతినిధినీ గుర్తించాలి. అతనిలోని ఆత్మశక్తిని అంగీకరించాలి. ఈ విశ్వాసమే లేకపోతే మనం పాపోచ్చారణం చేయలేం.

6. పాపోచ్చారణం దివ్యారాధనంలో ఓ భాగం

పాపోచ్చారణ సంస్కారం ద్వారా మనం దివ్యారాధనంలో పాల్గొంటాం. క్రైస్తవులుమొట్టమొదట జ్ఞానస్నానం ద్వారా దివ్యారాధనంలో పాల్గొంటారు. జ్ఞానస్నానం పొందినప్రజలు పూజలో పాల్గొని దేవుణ్ణి కొలుస్తారు. కాని జ్ఞానస్నానం స్వీకరించినవాళ్లు కూడఫరోరపాపాలు చేయవచ్చు. జ్ఞానస్నానం పాపాలను మన్నిస్తుంది గాని ఆ సంస్కారాన్ని