పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


1. పాపోచ్చారణ సంస్కారం

ఇటీవలి కాలంలో పాపోచ్చారణ సంస్కారానికి ప్రసిద్ధి తగ్గిపోతూంది. నేడు చాలమంది దీన్ని శిక్షాత్మకమైన సంస్కారంగా భావిస్తున్నారు. విశ్వాసులు దీనిపట్ల అంతగా ఇష్టం చూపడం లేదు. కాని ఈ సంస్కారాన్ని అపార్థం చేసికోవడం వల్లనే ఈ యనిష్టభావం పట్టింది. ఈ సంస్కారం ద్వారా మనం దేవుణ్ణి కలసికొంటాం. దీనిద్వారా మన సొంత క్రియలైన పశ్చాత్తాపం, పాపోచ్చారణం, ప్రాయశ్చిత్తం మొదలైనవి పవిత్రాలై వరప్రసాదాన్ని సాధిస్తాయి. ఈ యధ్యాయంలో ఆరంశాలు పరిశీలిద్దాం.

1. పరివర్తనం చెందాలి

సువిశేషం నరులను దేవుని చెంతకు తిరిగిరమ్మని ఆహ్వానిస్తుంది. దైవరాజ్యం సమిూపించింది కనుక నరులందరూ పరివర్తనం చెందాలి అని చెప్పంది - మత్త 4, 17. క్రీస్తుతో దైవరాజ్యం రానేవచ్చింది. కనుక నరులందరూ పశ్చాత్తాప పడాలి. హృదయ శుద్ధిని పొంది ఆ ప్రభువుని అతడు కొనివచ్చిన దైవరాజ్యాన్ని అంగీకరించాలి.

ఈ పరివర్తనంలో మూడు అంశాలున్నాయి. మొదటిది, పాపాన్ని విడనాడాలని అభిలషించడం. పాపమంటే కేవలం పాపక్రియ మాత్రమే కాదు. పాపావస్థలో వుండిపోవడం గూడ, దేవునికి దూరం కావడం గూడ. కనుక మనం దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పకోవాలి. ఆ ప్రభువు నుండి పాపవిముక్తినీ రక్షణాన్నీ పొందాలని అభిలషించాలి. పరిసయునితో పాటు దేవళానికి వెళ్ళిన సుంకరిలాగే మనం కూడ పాపవిమోచనం పొందాలని అభిలషించాలి - లూకా 18,9-14.

రెండవది, దేవుని చెంతకు తిరిగిరావాలని కోరుకోవడం. పాపమంటే దేవునిదగ్గరి నుండి వెళ్ళిపోవడం. అపమార్గం పట్టడం. అతనిమిూద తిరుగుబాటు చేయడం. అతనితో సఖ్యసంబంధాలు తెంచుకోవడం. కనుక పాపియైనవాడు పశ్చాత్తాపం ద్వారా దేవుని చెంతకు తిరిగిరావాలి. అతనితో అన్యోన్యతను పెంపొందించుకోవాలి. నేను మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళి నా తప్పను ఒప్పకొంటాను అనుకొన్న దుడుకు చిన్నవాడిలాగ మనం కూడ మళ్ళీ దేవుని చెంతకు తిరిగిపోవడానికి సంసిద్దులం కావాలి. యూదులు తమ పాపాలకు శిక్షగా ప్రవాసంలో జిక్కి బాధపడుతూన్నప్పుడు ప్రవక్తలు వాళ్ళను ప్రబోధించారు. యెరూషలేమునకు తిరిగిపోయి దేవళంలో ఆ ప్రభువు తేజస్సును మళ్ళా దర్శించాలని ప్రోత్సహించారు. ప్రేమతో నిబంధనం చేసికొన్న ఆ దేవునితో మళ్ళా రాజీ