పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


5. పాపోచారణం

మనవిమాట

ఈ గ్రంథాన్ని పూర్వమే బైబులుబాప్యం 52-53 సంచికల్లో ప్రచురించాం. కొలది మార్పులతో ఆ రెండు సంచికలను ఇప్పడు ఏక గ్రంథంగా ప్రచురించాం.

నేడు అందరికీ దైవభక్తి పాపభీతి తక్కువైపోతున్నాయి. ప్రాపంచిక వ్యామోహాలు ఎక్కువై పోతున్నాయి. ఫలితంగా విశ్వాసులు పాపోచ్చారణ సంస్కారాన్ని విలువతో చూడ్డం లేదు. చాలమంది దాన్ని అట్టే వినియోగించుకోవడం లేదు. అది అపార్ధాలకి గురౌతుంది కూడ. కనుక ప్రస్తుత గ్రంథంలో ఈ సంస్కారాన్ని విపులంగా వివరించాం. దీని పుట్టుపూర్వోత్తరాలూ, ప్రాముఖ్యమూ, దీన్ని ఉపయోగించుకోవలసిన తీరూ సవిస్తరంగా తెలియజేసాం. విశ్వాసులు తరచుగాను, భక్తితోను పాపోచ్చారణ సంస్కారంలో పాల్గొనడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. నరుడు నిజాయితీతో పశ్చాత్తాపపడి హృదయశుద్ధిని పొందడం కంటె బైబులు భగవంతుడు అధికంగా కోరుకొనే దేముంటుంది?

"పాపసంకీర్తనం" (పాపాలను కీర్తించడం) అనేమాట ఎబ్బెట్టుగా వుంది. కనుక ఈ గ్రంథంలో సర్వత్ర "పాపోచ్చారణం" అనే పదాన్ని వాడాం. ఇది నాల్గవ ముద్రణం.

విషయసూచిక

1. పాపోచ్చారణ సంస్కారం 155
2. పాపం 163
3. పశ్చాత్తాపం 172
4. పాపోచ్చారణ చరిత్ర 179
5. మనస్తాపం 184
6. పాపోచ్చారణం 189
7. ప్రాయశ్చిత్తం 200
8. పాపోచ్చారణ విధి 206
- ప్రశ్నలు 212
- బైబులు అవలోకనాలు 24