పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయం - 4


1 "జ్ఞానస్నానం విశ్వాసాన్ని దయచేసే సంస్కారం” వివరించండి.
2 జ్ఞానస్నానం వలన మనం ఏలా శ్రీసభలో చేరతామో వివరించండి.
3 ఈ సంస్కారం వలన మనం ఏలా దత్తపుత్రులమౌతాం?
4 ఈ సంస్కారం ద్వారా మనం క్రీస్తు యాజకత్వంలో పాలుపొంంది యాజకులమయ్యే తీరును వివరించండి.
5 జ్ఞానస్నానం మనకు పాపపరిహారాన్నీ శిక్షానిర్మూలనాన్నీ ఏలా సంపాదించి పెడుతుంది?

అధ్యాయం - 5


1 చిన్న బిడ్డలకు జ్ఞానస్నానం ఎందుకీయాలి? జ్ఞానస్నానం లేకుండానే చనిపోయే బిడ్డలగతి యేమాతుంది?
2 వేదసాక్షి మరణం జ్ఞానస్నానం లాంటిది ఏలా ఔతుంది?
3 ఆశజ్ఞానస్నానం అంటే యేమిటి?
4 జ్ఞానస్నానాన్ని గూర్చిన ప్రోటస్టెంటు శాఖలవాళ్ళ భావాలను సంగ్రహంగా వివరించండి.
5 ఈ సంస్కారాన్ని జ్ఞప్తికి తెచ్చే సందర్భాలు ఏమిటివి?

అధ్యాయం - 6


1 ఆత్మ వాగ్లానాన్నీ ఆ యాత్మ వేంచేయడాన్నీ గూర్చిన, బైబులు బోధలను వివరించండి.
2 భద్రమైన అభ్యంగనంలో హస్తనిక్షేపణంనుండి అభ్యంగనానికి ప్రాముఖ్యం ఈయడం అనే మార్పు ఏలా వచ్చిందో వివరించండి.

అధ్యాయం - 7


1 అపోస్తలులు క్రీస్తుకి ఏలా సాక్షులయ్యారో వివరించండి.
2 భద్రమైన అభ్యంగనం మనలను క్రీస్తుకి ఏలా సాక్షులను చేస్తుంది?
3 జ్ఞానస్నానం భద్రమైన అభ్యంగనం అనే రెండు సంస్కారాలు దయచేసే వరప్రసాదాలకు వ్యత్యాసం ఏమిటి?