పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రశ్నలు

అధ్యాయం -1

1 క్రీస్తు యోర్గాను జ్ఞానస్నానం అతని మరణాన్ని ఏలా సూచిస్తుంది?
2 జ్ఞానస్నానాన్ని గూర్చిన పౌలు భావాలను మూడింటిని వివరించండి.
3 జ్ఞానస్నానంలో మనం క్రీస్తుతోపాటు ఏలా చనిపోతాం, ఏలా ఉత్తానమౌతాం?
4 యోహాను పేర్కొన్న జీవజలం జ్ఞానస్నానాన్ని ఏలా సూచిస్తుంది?

అధ్యాయం - 2

1 వివిధ మతాల్లోని స్నానాలనూ, వాటి భావాలనూ వివరించండి.
2 జలం మరణాన్నీ జీవాన్నీ కూడ తెచ్చిపెడుతుందని బైబులు సంఘటనలనుండి నిరూపించండి.
3 క్రీస్తు జలాన్ని పాపపరిహారవస్తువుగా నిర్ణయించడంలో ఉద్దేశం ఏమిటి?
4 యూదమతంలోని జ్ఞానస్నాన పద్ధతులను వివరించండి.
5 జ్ఞానస్నానాన్ని ఈయడానికీ, పొందడానికీ ఎవరెవరు అరులు? ఎందుకు?
6 క్రీస్తు, క్రైస్తవుడు అనే పదాలకు అర్థమేమిటి?

అధ్యాయం - 3

1 పితృపాదులు బోధల నుండి జ్ఞానస్నాన జలం మనలను కడిగి శుద్ధి చేస్తుందనే అంశాన్ని వివరించండి.
2 “మన చేప క్రీస్తు. ఆ చేప ననుసరించి మనం కూడ నీటిలో చిన్న చేపలంగా పుడతాం" అన్న టెర్టూలియన్ వాక్యాల భావం ఏమిటి?
3 జ్ఞానస్నాన జలానికీ జలప్రళయ జలానికీ పోలికలను తెలియజేయండి.
4 యూదుల సముద్రోత్తరణానికీ నూత్నవేద జ్ఞానస్నానానికీ గల సామ్యాలను వివరించండి.
5 జ్ఞానస్నానం ప్రసాదించే వెలుగు ఏలాంటిదో తెలియజేయండి.
6 పిశాచంతో పోరాడ్డానికి జ్ఞానస్నానం మనలను ఏలా సిద్ధం చేస్తుంది?