పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం ఎంత గొప్ప భక్తులమైనా జ్ఞానస్నాన పావిత్ర్యాన్ని మించిపోలేం. ఈలాంటి మహావరాన్ని మనం ఎప్పడూ మరచిపోగూడదు. దాన్ని మళ్ళామళ్ళా భక్తితో జ్ఞప్తికి తెచ్చుకొని దేవునికి వందనాలర్పిస్తూండాలి.

పరిశుద్ధ వారంలో పెద్దశనివారం రాత్రివచ్చే పాస్కపూజలో జ్ఞానస్నాన ప్రమాణాలను నూత్నపరుస్తాం. విశ్వాసులందరూ ఈ పుణ్యకార్యంలో భక్తితో పాల్గొని తమ జ్ఞానస్నానాన్ని కృతజ్ఞతతో గుర్తు తెచ్చుకోవాలి. సంవత్సరమంతా శ్రద్ధాసక్తులతో పవిత్ర జీవితాన్ని జీవించి జ్ఞానస్నానాన్ని ఫలప్రదం చేసికొంటామని ప్రమాణం చేయాలి.

ఆదివారం ప్రభువు ఉత్దానాన్ని గుర్తుకి తెచ్చుకొనేదినం, ఆ దినం పూజలో విశ్వాసుల మీద తీర్థం చల్లుతారు. ఈ తీర్థం మన జ్ఞానస్నానజలానికి గుర్తుగా వుంటుంది. ఈ నీళ్ళు మనమీద పడినప్పడు సిలువగుర్తు వేసికొంటాం. ఈ సందర్భంలో కూడ జ్ఞానస్నానాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.

ఇంకా కొన్ని గుళ్లల్లో తలవాకిట తీర్థం పోసివుంచుతారు. గుళ్ళకి వెళ్ళేవాళ్ళంతా ఆ తీర్థంతో సిల్వగుర్తు వేసికొంటారు. ఇది కూడ జ్ఞానస్నాన జలాన్ని జ్ఞప్తికి తేచ్ఛ్హె సందర్భమే. ఈలాంటి భక్తికార్యాల ద్వారా మనం ఈ సంస్కారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

6. జ్ఞానస్నానం రెండు సంస్కారాలుగా విభజింపబడింది

తొలిరోజుల్లో జ్ఞానస్నానమూ భద్రమైన అభ్యంగనమూ రెండూ కలిసి ఒకే సంస్కారంగా ఉండేవి. నాల్గవ శతాబ్దంలో ఇవి వేర్వేరు సంస్కారాలు అనే భావం స్పష్టం కాలేదు. మొదటి రోజుల్లో అభ్యర్థిమీద చేతులు చాచడం భద్రమైన అభ్యంగనంలో ముఖ్యకార్యం. కాని రాను రాను అభ్యంగనమే ముఖ్య కార్యమైంది. ఈ సంస్కారం ప్రధానంగా ఆత్మను దయచేసేది. ఇక్కడ మూడంశాలను పరిశీలిద్దాం.

1. బైబులు బోధలు

1. ఆత్మను గూర్చిన వాగ్దానం

బైబులు మొదటినుండి ఆత్మను గూర్చి చెపూనే వుంటుంది. మొదటలో ఆ గ్రంథం ఆత్మను దేవుని శ్వాసనుగా వర్ణిస్తుంది. ఈ శ్వాస సృష్టిని చేస్తుంది. ప్రాణాన్నిస్తుంది.