పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కడన స్త్రీలకూ జ్ఞానస్నానమీయాలి” అని వాకొంటుంది. ఇదేకాలంలో ఇరనేయస్ అనే వేదశాస్త్రి "క్రీస్తు అందరినీ రక్షించడానికి వచ్చాడు. అతని ద్వారా నూత్నపట్టువు నొందినవాళ్ళ నందరినీ - అనగా శిశువులనూ బాలలనూ పెద్దవాళ్ళనూ వృద్దులనూ - ఆ ప్రభువే రక్షిస్తాడు" అని వాకొన్నాడు. మూడవ శతాబ్దంలో ఓరిజన్ “శ్రీసభ శిశువులకు జ్ఞానస్నానాన్నిచ్చే సంప్రదాయాన్ని అపోస్తలుల నుండే గ్రహించింది. ఏ నరుడూ, ఒకరోజు ప్రాయంగల శిశువుకూడ, పాపాన్నుండి తప్పించుకోలేడు అని యోబుగ్రంథం చెప్తుంది? అని నుడివాడు. అదేకాలంలో సిప్రియన్ ఈ యంశాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు కారేజ్ మహాసభ చేసిన నియమాన్ని పేర్కొన్నాడు. శిశువు పుట్టిన వెంటనే జ్ఞానస్నానం ఈయాలనీ, ఎనిమిదవ దినందాకా ఆగకూడదనీ ఈసభ 253లో నియమం చేసింది. కనుక తొలిరోజులనుండీ శిశుజ్ఞానస్నానం అమలులో ఉండేదని నిరూపించడానికి పై యూదాహరణలు చాలుకదా!

రెండవప్రశ్నయిది. జ్ఞానస్నానం పొందకుండా చనిపోయే బిడ్డలగతి ఏమౌతుంది? ఈ ప్రశ్నకు పూర్వం వేదశాస్త్రులు ఈలా జవాబు చెప్పారు. జ్ఞానస్నానం లేకుండా చనిపోయే బిడ్డలు "పసిబిడ్డలస్థలం" అనే చోటికి వెళ్లారు. అక్కడ వాళ్ళ దేవుణ్ణి చూడలేరుగాని ఒకవిధమైన సంతోషాన్ని మాత్రం అనుభవిస్తారు.

కాని ఇటీవల వేదశాస్రులు ఈ ప్రశ్నకు మరొకవిధంగా జవాబు చెప్తున్నారు. నరులను దేవద్రవ్యానుమానాల ద్వారా మాత్రమే రక్షించవలసిన అవసరం దేవునికి లేదు. కనుక అతడు ప్రత్యేకపరిస్థితుల్లో బిడ్డలను జ్ఞానస్నానం ద్వారాగాక ఇతరమార్గాల ద్వారా గూడ రక్షించవచ్చు. ఈ యితర మార్గాలు ఏమిటివి? 1) సంబంధ మార్గాలు. జ్ఞానస్నానం లేకుండానే చనిపోయిన శిశువు తన తల్లిదండ్రుల విశ్వాసంవల్లగాని తిరుసభ విశ్వాసంవల్లగాని రక్షణం పొందవచ్చు. వీళ్ళతో శిశువుకి సంబంధం వుంటుంది. ఇంకా ఈలాంటి శిశువులు తాము ప్రాత ఆదాముతోగల సంబంధంవల్ల జన్మపాపాన్ని తెచ్చుకొన్నట్లే క్రొత్త ఆదాముతోగల సంబంధంవల్ల ఆ పాపరాహిత్యాన్ని గూడ తెచ్చుకోవచ్చు. ఈ సంబంధాల్లో ఏదైనా బిడ్డను రక్షించవచ్చు.

2) ఆశజ్ఞానస్నాన మార్గాలు. భగవంతుడు ఈలాంటి శిశువులకు మరణసమయంలోగాని మరణానంతరంగాని గొప్ప వెలుగుని ప్రసాదించవచ్చు. ఆ వెలుగులో శిశువు జ్ఞానస్నానాన్ని కోరుకోవచ్చు. అప్పడు రక్షణం కలుగుతుంది. ఈ నూత్న బోధలను తిరుసభ అధికారపూర్వకంగా అంగీకరించనూలేదు, నిరాకరించనూలేదు. కనుక మన భావాలు కూడ ఈలాగే వుండాలి. అనగా ఈ మార్గాల ద్వారా బిడ్డలకు రక్షణం కలుగుతుందో లేదో మనకు రూఢిగా తెలియదు. మన తరుపున