పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేపడతాడని కూడ నుడివాడు- మార్కు 16, 16. పౌలు జ్ఞానస్నానం వల్లనే రక్షణం కలుగుతుందని ఎక్కడా చెప్పకపోయినా, అతని బోధలు పరోక్షంగా ఆ భావాన్ని సూచిస్తాయి.

ట్రెంటుమహాసభ "సువిశేషం ప్రకటింపబడిన తరువాత జ్ఞానస్నానం ద్వారా లేక ఆశజ్ఞానస్నానం ద్వారా మాత్రమే రక్షణం కలుగుతుంది. ఈ సంస్కారం ద్వారా మాత్రమే మనం పుణ్యాత్ములమౌతాం” అని బోధించింది. దేవునికీ నరునికీ మధ్య ఒక్కడే ఒక్కడు మధ్యవర్తి, క్రీస్తు — 1తిమో 2,5. అతని ద్వారానే మనకు రక్షణం. కాని అతడు మనం జ్ఞానస్నానం పొందాలని ఆదేశించాడు - మత్త 16,16. కనుక అది రక్షణానికి అవసరం. ఐనా ఈ యవసరమనేది మామూలు పరిస్థితుల్లోనేగాని, అన్ని పరిస్థితుల్లో కాదు. కనుక కొన్నిసార్లు ఆశ జ్ఞానస్నానం, లేక వేదసాక్షి మరణం సరిపోవచ్చు. సంస్కారాల ద్వారా మాత్రమే నరుణ్ణి రక్షించవలసిన అవసరమేమీ దేవుడికి లేదు.

2. చిన్న బిడ్డలకు గూడ జ్ఞానస్నానం అవసరం

ఇక్కడ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వుంటుంది. మొదటి ప్రశ్న ఇది. చిన్నబిడ్డల జ్ఞానస్నానం తిరుసభలో మొదటినుండి అమలులో వుందా? ప్రొటస్టెంటుల్లో బాప్టిస్టు శాఖకు చెందినవాళ్ళ చిన్నబిడ్డల జ్ఞానస్నానాన్నిఅంగీకరించరు. శ్రీసభ తొలిరోజుల్లో ఈ పద్ధతి లేదని వీళ్ళవాదం. కాని ఇది పొరపాటు. ఇటీవల కుల్మాన్, జెరెమియాసు మొదలైన ప్రోటస్టెంటు శాఖలకు చెందిన ఉద్దండ పండితులు ఈ యంశాన్ని కూలంకషంగా అధ్యయనంచేసి శ్రీసభలో తొలిరోజులలో నుండి శిశు జ్ఞానస్నానం అమలులో వుందని తేల్చారు. యూదులు అన్యమతాలనుండి తమ మతాలలో చేరినవాళ్ళ బిడ్డలకు జ్ఞానస్నానమిచ్చేవాళ్ళ తమబిడ్డలకు సున్నతి చేయించేవాళ్ళు ఈలాగే తొలిరోజుల్లో క్రైస్తవులు కూడ తమ బిడ్డలకు జ్ఞానస్నానం ఇప్పించేవాళ్లు, "చిన్నబిడ్డలను నా చెంతకు రానీకుండా ఆటంకపరచవద్దు" అన్న క్రీస్తు వాక్యం (మార్కు 10,14) శిశుజ్ఞానస్నానం సూచిస్తుందని టెరూలియను మొదలైన తొలిరోజుల్లోని వేదశాస్తులు వ్రాసారు. ఫిలిప్పినగరంలో కారాగారాధికారీ "అతని యింటివారందరూ" జ్ఞానస్నానం పొందారు అచ 16,33. అలాగే కొరింతులో సమాజమందిరపు అధికారియైన క్రిస్పు "అతని యింటివారందరూ" జ్ఞానస్నానం పొందారు - 18,8. వీళ్ళల్లో శిశువులు కూడ వుంటారని పై పండితుల ఊహ.

రెండవ శతాబ్దంలో హిప్పోలీటస్ వ్రాసిన “అపోస్తలుల పారంపర్యబోధ" అనే గ్రంథం "మొదట శిశువులకు జ్ఞానస్నాన మీయాలి. మాటలాడలేనివాళ్ళ తరుపున వాళ్ళ తల్లిదండ్రులుకాని బంధువులుకాని మాటలాడాలి. అటుపిమ్మట పెద్దవాళ్ళయిన పురుషులకూ