పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకా సీనోభక్తుడు ఈలా చెప్పాడు. "శ్రీసభ మనకు జన్మనిచ్చేతీరుకీ మన భూలోక తల్లులు జన్మనిచ్చే తీరుకీ తేడా వుంది. లోకంలోని తల్లులు బిడ్డలను కనినప్పడు ఘోరవేదన ననుభవిస్తారు. కాని పరలోక తల్లియైన శ్రీసభ సంతాపంతోగాక సంతోషంతో మనకు జన్మనిస్తుంది. ఆమె స్వేచ్ఛతో మనలను కంటుంది. మనం కూడ పాపదాస్యానికి లొంగక స్వేచ్ఛతోనే పుడతాం"

3. జ్ఞానస్నానం ముగిసాక గురువు భక్తుని శిరస్సుమీద క్రిస్మాతైలంతో సిలువగుర్తు వేస్తారు. ఈ ముద్రను జూచి పిశాచం భయపడి మనలను పీడించడానికి జంకుతుంది. ఈ సందర్భంలో సిరిల్ భక్తుడు ఈలా వ్రాసాడు. "జ్ఞానస్నానంలో పొందే సిలువ ముద్రద్వారా నరుడు క్రీస్తుకి చెందినవాడవుతాడు. ఒకసారి ఈ ముద్రనుపొందిన పిదప అతడు భక్తితో సిలువగుర్తు వేసికొంటే చాలు, పిశాచం భయపడిపారిపోతుంది. సిలువగుర్తు వేసికోవడానికి సిగ్గుపడేవాళ్లు పడవచ్చు గాక, మనం మాత్రం బహిరంగంగా నొసటిమీద ఆ గుర్తు వేసికోవాలి. దయ్యాలు ఆ రాజగుర్తును చూచి పారిపోతాయి. కనుక మనం అన్నపానీయాలు సేవించేపుడూ నిద్రించేపుడూ మేల్కొనేపుడూ, వేయేల అన్ని పనుల్లోను ఈ గుర్తు వేసికోవాలి".

4. జ్ఞానస్నానం పొందగోరేవాళ్ళకు పిశాచం అవిశ్వాసం పుట్టించి అవరోధాలు కలిగిస్తుంది. ఈపట్టున సిరిల్ భక్తుడు ఈలా నుడివాడు. "పిశాచ సర్పం త్రోవప్రక్కన పొంచివుండి జ్ఞానస్నానాన్ని పొందబోయే నిన్ను గమనిస్తూ వుంటుంది. అది నీలో అవిశ్వాసం పట్టించడం ద్వారా నిన్ను కాటువేస్తుంది. ఆ సర్పం రక్షణాన్ని పొందబోయే వాళ్ళ వెంటబడి వాళ్ళను మింగగోరుతుంది. నీవు ఆత్మలకు అధిపతియైన దేవుణ్ణి చేరబోతున్నావు. కాని నీవు ఆ క్రూరసర్పం ప్రక్కగా నడచి పోవాలి. దాన్నేలా తప్పించుకొంటావు? నీ పాదాలకు సువిశేషసందేశమనే చెప్పలు తొడుగకో, అప్పడు ఆ సర్పం ఒక వేళ నిన్ను కాటువేసినా నీకు ప్రమాదం కలుగదు".

5. రక్షణాన్ని పొందాలంటే జ్ఞానస్నానం అవసరం

రక్షణాన్ని సాధించాలంటే జ్ఞానస్నానం అవసరం. దాన్ని వస్తుతః పొందడానికి వీలులేని పరిస్థితుల్లో ఆశజాన స్నానం సరిపోతుంది. వేదసాక్షి మరణం కూడ జ్ఞానస్నానంతో సమానం. ఈ యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దాం.

1. రక్షణానికి జ్ఞానస్నానం అవసరం

నరుడు నీటినుండి ఆత్మనుండీ జన్మిస్తేనేతప్ప దైవ రాజ్యాన్ని ప్రవేశింపలేడు అన్నాడు ప్రభువు - యోహా 3,6. ఇంకా, విశ్వసించి జ్ఞానస్నానం పొందేవాడు రక్షణాన్ని