పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనకు నానా వరాలను దయచేస్తుంది - 1కొరి 12, 4-11. ఈలా మన దత్తపుత్రత్వం, ప్రేమజీవితం, మోక్షభాగ్యానికి వారసులం కావడం మొదలైన భాగ్యాలన్నీ ఆత్మద్వారానే సిద్ధిస్తాయి.

4. క్రీస్తు మూడుగుణాల్లో పాలుపొందుతాం

జ్ఞానస్నాన సంస్కారం చివరలో గురువు అభ్యర్థి శిరస్సును క్రిస్మాతైలంతో అభిషేకించి సిలువగుర్తు వేస్తారు. దీనివల్ల అభ్యర్థిమీద ఓ ముద్ర పడుతుంది. ఈ ముద్రను గూర్చే పౌలు "మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింప బాడ్డారు" అని పేర్కొన్నాడు. - ఎఫె 1,13. ఇక్కడభావం ఇది పూర్వం గ్రీకు రోమను దేశాల్లో బానిసలమీదా జంతువుల మీదా యజమానునిముద్ర వేసేవాళ్ళు సైనికులమీద రాజముద్ర వుండేది. భక్తులమీద వాళ్ళకొల్చే దేవతముద్ర వుండేది. ఈలాగే జ్ఞానస్నానానికి ముందు మనమీద పిశాచముద్ర వుంటుంది. ఈ సంస్కారంలో పవిత్రాత్మ మనమీద క్రీస్తుముద్ర వేస్తుంది. ఆ మీదట మనం పిశాచమనే యజమానునికిగాక క్రీస్తనే యజమానునికి చెందినవాళ్ళ మౌతాం.

ఇది చెరగిపోని అక్షయమైన ముద్ర. కనుకనే ఒకసారి యోగ్యంగా జ్ఞానస్నానం పొందినవాళ్ళ దాన్ని మళ్ళా పొందరు. మూడవ శతాబ్దంనాటికే తిరుసభలో ఈ నియమం అమలులోనికి వచ్చింది. నరుడు చావైన పాపంచేసినా, మత పరిత్యాగం చేసినాకూడ ఈ ముద్ర చెరగిపోదు. అది కాల్చిన ఇనుపకడ్డీతో చర్మంపై వేసిన ముద్రకంటె ఇంకా దృఢంగా నిలుస్తుంది. ఈ ముద్ర వరప్రసాదాన్ని సూచిస్తుంది. కనుక పాపి పాపంవల్ల వరప్రసాదాన్ని పోగొట్టుకొన్నా మళ్ళా పశ్చాత్తాపపడగానే పూర్వవరప్రసాదాన్ని పొందుతాడు. ఈ ముద్రద్వారానే మనం క్రీస్తులోనికి ఐక్యమై ఆయన్ని పోలినవాళ్ళ మౌతాం.

ఇక, క్రీస్తులో మూడు గుణాలున్నాయి. ఆయన్ని రాజు, యాజకుడు, ప్రవక్త ఈ గుణాలను పొందడానికి ప్రభువు మూడు అభిషేకాలను స్వీకరించాడు. అసలు ఆయన పేరుకే అభిషేకం పొందినవాడని అర్థం. మెస్సియా అనే హీబ్రూ పదానికీ, క్రీస్తు అనే గ్రీకుమాటకీ అభిషిక్తుడని భావం, పూర్వం యూదులు రాజులనీ ప్రధానయాజకులనీ అభిషేకించేవాళ్ళు అభిషేకంద్వారా దేవుడు ఆ భక్తులను ఈ పదవుల్లోనియమించేవాడు. అలాగే తండ్రి కుమారుడ్ని తన ప్రతినిధిగా ఈలోకంలోకి పంపాడు. కుమారుణ్ణి ప్రతినిధి పదవిలో నియమిస్తూ ఆయనకు అభిషేకం చేసాడు. కనుక ఆ కుమారునికి మెస్సీయా, లేక క్రీస్తు, లేక అభిషిక్తుడు అని పేరు.

ఇక, క్రీస్తు పొందిన మూడభిషేకాలు ఇవి. ఉత్త్దాన సమయంలో తండ్రి ఆయన్ని రాజుగా అభిషేకించాడు. - అచ 2, 36. మనుష్యావతారమెత్తిన సమయంలో యాజకుడుగా