పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఒకమారు శ్రీసభలో చేరాక మనం పాపంచేసి దివ్యజీవనాన్ని పోగొట్టుకొంటే, ఆ తల్లి తన యాజకులైన గురువుల పరిచర్య ద్వారా మనకు పాపోచ్చారణ సంస్కారాన్ని దయచేస్తుంది. ఆ కరుణాకార్యంవల్ల మనంపోగొట్టుకొన్న దివ్య జీవనాన్ని మళ్ళా సంపాదించుకొంటాం.

శ్రీసభలో ప్రవేశించిన క్రైస్తవులకు గొప్ప బాధ్యతలున్నాయి. వాళ్ళు స్వయంగా పవిత్రజీవితం జీవిస్తూ శ్రీసభ పవిత్రతకు సాక్ష్యంగా వుండాలి. ఈ పవిత్ర జీవితం ద్వారానే ఇతరులను గూడ శ్రీసభలోనికి ఆకర్షిస్తూండాలి. ఆసభను నిరంతరమూ పెంచుతూండాలి. ఇంకా శ్రీసభలోని సభ్యులంతా పరస్పరం ఐక్యమై ప్రేమజీవితం జీవించాలి. ఈ ఐక్యతకీ ప్రేమకీ చిహ్నంగా వుండేది దివ్యసత్ప్రసాదం. కనుక క్రైస్తవులు ఈ సంస్కారాన్నియోగ్యంగా స్వీకరించి శ్రీసభ ఐక్యతను పెంచాలేగాని అంతఃకలహాలతో విభజనలు తెచ్చిపెట్టకూడదు. జాతులూ వర్గాలూ కులాలతో కూడిన మనదేశంలో ఈ బెదడ యెప్పడూ వుండనే వుంటుంది. పౌలు క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్ళంతా క్రీస్తుని ధరిస్తారని చెప్పాడు. ఇక వాళ్ళలో యూదుడనీ గ్రీసు దేశీయుడనీ, దాసుడనీ స్వతంత్రుడనీ, పురుషుడనీ స్త్రీ అనీ తారతమ్యాలు ఉండకూడదన్నాడు. క్రీస్తునందు మనమందరమూ ఐక్యమౌతామన్నాడు - గల 4,27-28. అనగా క్రైస్తవులమైన మనలో ఆ కులం ఈ కులం అనే భేదముండకూడదు. ధనికులూ దరిద్రులనే భేదం వుండకూడదు. స్త్రీ పురుషులనే లింగభేదమూ వుండకూడదు. కాని నేడు మనం ఈ సూత్రాలను ఎంతవరకు పాటింపగల్లుతున్నాం?

జ్ఞానస్నానం ద్వారా మనం శ్రీసభలోనికి ఐక్యమౌతామని చెప్పాం. కాని ఆ శ్రీసభ ఎల్లప్పడూ మోక్ష క్రీస్తువైపు ముఖం త్రిప్పి వుంటుంది. కనుక ఈ లోకంలో జీవించే మనం కూడ మోక్షంవైపు మనసు త్రిప్పతూండాలి. “మనకిక్కడ నిలవరమైన పట్టణంలేదు. మన నిజపట్టణం మోక్షమే" - హేబ్రే 13,14. ఈ లోకంలో మనం కేవలం యాత్రికులం. మన గమ్యస్థానం మోక్షం. అందుకే మన దృష్టి ఎప్పడు కూడ అక్కడుండాలి.

2. జ్ఞానస్నానం మనలను క్రీస్తుతో ఐక్యం చేస్తుంది.

క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్ళు ఆయనతో చనిపోయి ఆయనతో జీవిస్తారు - రోమా 6, 3,8. ప్రభువులోనికి జ్ఞానస్నాన పొందినవాళ్ళు ఆయన శరీరమై ఆయన అవయవాలౌతారు - 1 కొరి 12,27. ఆయనలోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లు ఆయనతో ఏకమౌతారు- గల 3.28. ఈ వాక్యాలన్నీ మనం క్రీస్తుతో ఐక్యమౌతామని రుజువుచేస్తాయి. ఈ యైక్యత జ్ఞానస్నానం వల్లనే సిద్ధిస్తుంది. ఈయైక్యతను సూచించడానికే