పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నాడు. సిలువమీద అతని హృదయాన్ని తెరవగా నీళ్లు స్రవించాయి కదా!- యోహా 19,34 ఈ సంఘటనం ఆ బండనుండి నీళ్ళ వెలువడ్డాన్ని తలపిస్తుంది. పూర్వవేదపు సముద్రోత్తరణానికీ నూతవేదప జ్ఞానస్నానానికీ ఎంత దగ్గరి సంబంధం వుందో ఈ పౌలు భావనాసరణినిబట్టే అర్థం చేసికోవచ్చు.

7. యోర్తాను నీళ్ళ

పూర్వవేద ప్రజలకు సముద్రోత్తరణంవలె యోర్గాను ఉత్తరణం కూడ ముఖ్యసంఘటనం. ఆ నదిని దాటిన పిదపగాని వాళ్లు వాగ్గత్త భూమిని స్వాధీనం చేసికోలేదు. ప్రాచీన క్రైస్తవులు యోర్గాను నీటిని కూడ జ్ఞానస్నానపు నీటితో పోల్చారు. యూదులు యోర్గానును దాటి వాగ్రత్త భూమిని స్వాధీనం చేసికొన్నట్లే మనం జ్ఞానస్నాన జలాలను దాటి మరో వాగ్దత్తభూమిని స్వాదీనం చేసికొంటాం. అదే మోక్షం. పెద్దవాళ్ళ జ్ఞానస్నానం తర్వాత దివ్యసత్రసాదాన్ని స్వీకరిస్తారు కదా! ఈ భోజనం మనకు మోక్ష బహుమానాన్ని సంపాదించి పెడుతుంది.

ఇంకా, యోర్గాను నీళ్ళ క్రీస్తు జ్ఞానస్నానాన్నిగూడ తలపిస్తాయి. మనం క్రీస్తు మరణంలోనికి జ్ఞానస్నానం పొందుతామని చెప్పాం. ప్రభువు యోర్గాను జ్ఞానస్నానం అతని మరణాన్ని సూచిస్తుంది. ఈ మరణాన్ని ఉద్దేశించే ప్రభువు "నేను పొందవలసిన జ్ఞానస్నానం ఒకటుంది" అని పల్మాడు - లూకా 12,50. క్రీస్తు యోహాను నుండి జ్ఞానస్నానం పొందింది స్వీయ పాపపరిహారానికిగాదు, మన పాపాల పరిహారానికి - యోహా 1,29. అతడు మన కిల్బిషాలను భరించే గొర్రెపిల్ల - యోహా 1, 29.

ప్రభువు యోర్గాను నీటినుండి బయటికి రాగానే మోక్షం తెరువబడింది. తండ్రి అతనికి సాక్ష్యం పలికాడు. ఆత్మ దిగివచ్చింది. ఈ సంఘటనలద్వారా తండ్రి క్రీస్తుని అంగీకరించడమూ, అతనికి ఉత్థానాన్ని దయచేసి మహిమను ప్రసాదించడమూ అనే దైవరహస్యాలు సూచింపబడ్డాయి - మత్త 3, 16-17.

క్రీస్తు యోర్గాను జ్ఞానస్నానం మన జ్ఞానస్నానానికి పోలికగా వుంటుంది. మనం జ్ఞానస్నానం పొందేది క్రీస్తు మరణోత్థానాల్లోనికిగాని అతని జ్ఞానస్నానంలోకి కాదు. ఐనా ఆ సంఘటనం నేటి మన జ్ఞానస్నానాన్నిసూచిస్తుంది. కనుక మనం ప్రభువు జ్ఞానస్నానాన్ని భక్తితో స్మరించుకోవాలి. మన ఆరాధన సంవత్సరంలో ఈ ఉత్సవం జనవరిలో వస్తుంది.

8. జ్ఞావస్నానం వెలుగుని ప్రసాదిస్తుంది

క్రీస్తు గ్రుడ్డివానికి చూపునిచ్చాడు. అతడు సిలోయము అనే కోనేటిలో కండ్లు కడుగుకొని దృష్టిని పొంది వెలుగుని చూడగలిగాడు-యోహా 9,7. ఈనాడు ప్రభువు