పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని మనకు దాస్యవిముక్తిఏలా జరిగింది? క్రీస్తు రక్షణాత్మకమైన మరణం ద్వారా, ఆ మరణమే ఇప్పడు మన జ్ఞానస్నానంలో పనిచేసేది. జ్ఞానస్నానజలం క్రీస్తుమరణ ఫలితాన్ని మన మీద చూపుతుంది. పూర్వం జ్ఞానస్నానం పొందే అభ్యర్థి మడుగులోకి దిగి మూడుసార్లు నీటిలో మునిగేవాడు. ఈలా దిగడం ద్వారా అతడు సమాధిలో పాతిపెట్టబడిన క్రీస్తు మరణంలోనికి దిగుతున్నాని సూచించేవాడు. తాను క్రీస్తుతోపాటు పాతిపెట్టబడి పాపానికి చనిపోతున్నాననీ సూచించేవాడు. తర్వాత మడుగులోనికి దిగిన అభ్యర్థి దిగిన వైపుగా గాకుండా ఆవలివైపుగా వొడ్డుకి ఎక్కివచ్చేవాడు.ఈలా ఎక్కిరావడం ద్వారా తాను కూడ క్రీస్తుతోపాటు ఉత్తాన మౌతున్నానని సూచించేవాడు. నూత్న జీవాన్ని జీవిస్తున్నానని తెలియజేసేవాడు. ఈ విధంగా క్రీస్తు మరణోత్తానాలు మన జ్ఞానస్నానంలో నెరవేరతాయి. కనుకనే ఈ సంస్కారం ఈనాడు మనకు ఫలితమీయ కలుగుతుంది. అందుకే భక్తుడు తోమాసు అక్వినాసు “జ్ఞానస్నాన సంస్కారంలో క్రీస్తు మరణిత్తానాలు సాంకేతికంగా మనమీద సోకుతాయి" అని చెప్పాడు. ఈ భావాన్నే పౌలు “మీరు. జ్ఞానస్నానంలో క్రీస్తుతోపాటు పాతిపెట్టబడుతున్నారు, అతనితో పాటు లేపబడుతున్నారు" అన్న వాక్యంలో పేర్కొన్నాడు- కొలో 2,12. రోమీయులు 6, 3–5లోకూడ అతడు ఇదే భావాన్ని వ్యక్తం చేసాడు.

ఇక్కడ పౌలు వ్రాసిన ఈ క్రింది వాక్యాలు మననం చేసికోదగ్గవి. "మన పితరులంతా మేఘంక్రింద ఉండేవాళ్ళ వాళ్ళ సముద్రంగుండా నడచిపోయారు. వాళ్ళంతా మోషే ద్వారా సముద్రంలోనికి మేఘంలోనికి జ్ఞానస్నానంపొందారు. అందరు అదే ఆధ్యాత్మికాహారాన్ని భుజించారు. అదే ఆధ్యాత్మిక పానీయాన్ని సేవించారు. అందరూ ఎడారిలో తమ్మనుసరించిన ఆధ్యాత్మిక శిలనుండి పానీయం త్రాగారు. ఆ శిలక్రీస్తే - 1కొరి 10, 1-5.

ఈ వాక్యాల్లో పౌలు యిప్రాయేలు ప్రజలు సముద్రం గుండా నడచిపోవడాన్ని వాళ్ళ జ్ఞానస్నానంగా ఉత్రేక్షించాడు. నూత్న వేదంలో మనం జ్ఞానస్నాన జలాలగుండా నడచిపోతామని ముందే చెప్పాం. పౌలు పేర్కొన్న మేఘం పవిత్రాత్మకు చిహ్నం. అక్కడ యిస్రాయేలీయులు సేవించిన ఆధ్యాత్మికాహారం మన్నా నూత్నవేదంలో మనం దివ్యసత్రసాదం సేవిస్తాం. అక్కడ వాళ్ళు త్రాగిన ఆ ఆధ్యాత్మిక పానీయం, మెరీబావద్ద బండనుండి వెలువడిన నీళ్ల-నిర్గ 17,6. ఈ నీళ్లు నూతవేదంలో జీవజలానికీ పవిత్రాత్మకీ జ్ఞానస్నాన జలానికీ గుర్తు. మోషే మెరీబావద్ద బెత్తంతో కొట్టిన బండ అటుపిమ్మట యిప్రాయేలీయులతోపాటు ఎడారిలో ప్రయాణం చేస్తూపోయిందని రబ్బయిలు చెప్పేవాళ్ళ ఇక్కడ పౌలు ఈ సంప్రదాయాన్ని పేర్కొన్నాడు. ఈ బండ క్రీస్తుకి సూచనంగా వుంటుంది