పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేరు మీదిగా నిన్ను మూడుసార్లు ప్రశ్నించగా నీవు మూడు సార్లు ఆ దైవవ్యక్తులను నమ్ముతున్నానని జవాబు చెప్పావు. అప్పుడు నిన్నుమూడుసార్లు నీళ్ళల్లో మంచారు. దీనివల్ల నీవు మూడు రోజులు సమాధిలోవున్న క్రీస్తుని పోలిన వాడివయ్యావు. తర్వాత నీళ్ళల్లో నుండి బయటికి వచ్చావు. ఆ నీళ్లల్లోనే నీవు చనిపోయావు. వాటిల్లోనే మరలా జన్మించావు కూడ. ఆ రక్షణజలం నీకు సమాధిగాను, మాతృగర్భంగాను కూడ పరిణమించింది?

6. రెల్ల సముద్రపు నీళ్ల

పూర్వవేద సంఘటన అన్నిటిలోను నూత్నవేద జ్ఞానస్నానాన్ని ఎక్కువగా సూచించేది సముద్రోత్తరణం. నూత్నవేద రచయితలూ పితృమూర్తులూ ఈ ఉదంతాన్ని చాలసార్లు పేర్కొన్నారు. కనుక ఇక్కడ ఈ యంశాన్ని విపులంగా పరిశీలించి చూద్దాం.

1) యిప్రాయేలు ప్రజలు ఐగుపులో పాస్కగొర్రెపిల్లను భుజించారు. మోషే నాయకత్వాన అక్కడినుండి వెడలివచ్చి సముద్రాన్ని దాటారు. వాళ్లను వెంబడించిన ఫరో సైన్యం మాత్రం ఇదే సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనంలో గూడ నీళ్లు మృత్యువుకీ జీవానికి కారణమయ్యాయి. ఈ సంఘటనంతో హెబ్రేయుల దాస్యమూ కష్టాలూ తొలగిపోయాయి. ప్రభువు మేఘరూపంలో రేయింబవళ్లు వాళ్ళను నడిపించాడు. సీనాయి కొండవద్ద వాళ్లతో నిబంధనం చేసికొన్నాడు. ఫలితంగా తాను వాళ్ళకు దేవుడయ్యాడు వాళ్ళు ఆయన్ని కొలిచే భక్తసమాజమయ్యారు. ప్రభువు వాళ్లను ఆ కొండనుండి వాగ్రత్తభూమికి నడిపించాడు. వాళ్ళకొరకు దారిలో మన్నా కురిపించాడు. మెరిబావద్ద రాతిబండ నుండి నీళ్లు దయచేసాడు. ఇంకా యెన్నో అద్భుత కార్యాలు కూడ చేసాడు.

.ఇది క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో ఐగుప్తనుండి జరిగిన నిర్గమన. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మరో నిర్గమనం జరిగింది. అది బాబిలోను నుండి 6వ శతాబ్దంలో బాబిలోను రాజులు యిస్రాయేలీయులను బందీలనుగా గొనిపోయారు. పూర్వం ఐగుప్త ప్రవాసంనుండివలె ఈ ప్రవాసం నుండి గూడ ప్రభువు వాళ్ళను విడిపించాడు. 5వ శతాబ్దంలో ప్రజలు మళ్ళా యెరూషలేమకి తిరిగివచ్చారు. ఈ సదర్భంలో ప్రభువు "నేను పూర్వంకంటె గూడ గొప్ప అద్భుతాలను చేస్తాను. అవి యిప్పడే సిద్ధమై యున్నాయి. మీరు వాటిని అర్థం చేసికోగలరా? నేను ఎడారిగుండా మార్గం నిర్మిస్తాను. మరుభూమి గుండా నీటి కాల్వలు పారిస్తాను" అంటాడు - యెష 43, 14-21.

2) పూర్వవేదంలోని పై రెండు నిర్గమనాలు నూత్నవేదంలో క్రీస్తు కొనిరాబోయే రక్షణాన్ని సూచిస్తాయి. అతని మరణోత్తానాలు నిర్గమనం లాంటివే. ఈ సందర్భంలో నాల్గవ శతాబ్ద భక్తుడైన అఫ్రాటెస్ అనే అతడు ఈలా వాకొన్నాడు "తొలి పాస్మవలన