పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౩.జ్ఞానస్నానాంతంలో గురువు అభ్యర్ధిచేతికి తెల్లని కండువా నిస్తారు. ఈ సందర్భంలో గురువు "ఈ తెల్లని వస్త్రం నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు సమక్షంలోనికి వెళ్ళి నిత్యజీవితంలో ప్రవేశించేదాకా దీన్ని నిర్మలంగా వుంచుకో" అనే ప్రార్థనను జపిస్తారు. ఈ తెల్లని వస్త్రం క్రిస్తుకీ నిర్మలత్వానికీ చిహ్నం. తబోరు కొండమీద రూపాంతరం పొందిన క్రీస్తు బట్టలను వెలుగువలె తెల్లగా వున్నాయి-మత్త 17,3. జ్ఞానస్నానంద్వారా మనం క్రీస్తుని ధరిస్తాం. పూర్వం ఈ సంస్కారాన్ని పొందే అభ్యర్థులు ప్రాత బట్టలను విడచి మడుగులో దిగేవాళ్ళ మళ్లి ఒడ్డుకి వచ్చాక ప్రాత బట్టలనుకాక తెల్లని క్రొత్త బట్టలను తాల్చేవాళ్ళు. కనుక ఇక్కడ మనం క్రొత్తబట్టలను ధరించినట్లుగా క్రీస్తుని ధరిస్తామని భావం - గల 3,27. దీనివల్ల మనకు ప్రాతతనం పోయి క్రొత్తతనం వస్తుంది. పాపాన్ని విసర్జించి పుణ్యాన్నిచేపడతాం. కనుకనే పౌలు "ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతసృష్టి ఔతాడు. పాతవి గతించి సమస్తమూ క్రొత్తవయ్యాయి" అని పల్మాడు - 2కొరి 5, 17. క్రీస్తు నుండి మనం పొందిన ఈ నూతనత్వాన్నీ పుణ్యజీవితాన్నీ రోజువారి జీవితంలో నిలబెట్టుకోగలిగి వుండాలి.

పదిమంది కన్యల సామెతలో వివేకవతులైన ఐదుగురు కన్యలు మేల్మొనివుండి పెండ్లికుమారుడు వచ్చేవరకు అతని కొరకు ఎదురుచూస్తూ వండిపోయారు. అతడు విజయం చేయగానే అతనితోపాటు తామూ విందుశాల లోనికి వెళ్ళారు - మత్త 25, 10. అలాగే జ్ఞానస్నానంలో తెల్లని కండువానూ అది సూచించే నూతనత్వాన్నీ పొందిన క్రైస్తవుడు ప్రభువు రెండవసారి విజయంచేసేదాకా గూడ తన విశ్వాసాన్నీ క్రొత్త తనాన్నీ నిలబెట్టుకొంటూ భక్తి భావంతో వేచివుండాలి.

4.జ్ఞానస్నానంలో చివరిసాంగ్యం అభ్యర్ధి చేతికి వెలిగే కొవ్వువత్తి నీయడం. ఈ సందర్భంలో గురువు "నీవు క్రీస్తునందు వెలుగువైతివి. కనుక సదా ప్రకాశపుత్రుడవుగా నడువు” అనే జపం చెప్తారు. పూర్వం జ్ఞానస్నానాన్ని పాస్క శనివారం రాత్రి యిచ్చేవాళ్ళ ఆ సందర్భంలో వెలిగింపబడిన పాస్క వత్తినుండే జ్ఞానస్నానం పొందే అభ్యర్థికిచ్చే చిన్న వత్తిని గూడ వెలిగించేవాళ్ళ కనుక ఈ వత్తి క్రీస్తుకి చిహ్నంగా వుంటుంది. ఆ ప్రభువు లోకానికి వెలుగు. ఆయన్ననుసరించే వాళ్ల చీకట్లో నడవరు- యోహా 18,12 ఆయనలోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లు కూడ చీకటిని దాటి వెలుగులోనికీ, మరణాన్నీ దాటి జీవంలోనికీ ప్రవేశిస్తారు. కనుక ఈ సంస్కారాన్ని పొందిన భక్తులు నిత్యజీవితంలో ఈ వెలుగునీ, ఈ