పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధికారికిని అతని కుటుంబానికిని కారాగారంలోనే జ్ఞానస్నానమిచ్చాడు - 16,33. ఈ సందర్భాల్లో ఈ వ్యక్తులను నీళ్ళల్లో మంచారు అనడంకంటే వీళ్ల నొసటిమీద నీళ్లపోసి జ్ఞానస్నానమిచ్చారని చెప్పడం సబబుకదా!

ల్యాటిన్ శ్రీసభలో నీళ్ళల్లో మంచే పద్ధతి 12వ శతాబ్దం దాకా వుండేది. ఆ తర్వాత నొసటిమీద నీళ్ళపోసే పద్ధతి సర్వత్ర ప్రచారంలోకి వచ్చింది. కాని ఈ రెండవపద్ధతి కూడ అడపాదడపా రెండవ శతాబ్దంనుండే ల్యాటిను శ్రీసభలోవాడుకలో వుండేదని ముందే చెప్పాం. గ్రీకు శ్రీసభలో ఇప్పటికీ నీళ్ళల్లో మంచిగాని జ్ఞానస్నాన మీయరు. నీళ్ళల్లో ముంచినా లేక నీళ్లు నొసటిమీద పోసినా ఫలితం సమానమే. ఈ నీళ్లు పాపపరిహారాన్నీ క్రొత్తపుట్టువనీ దయచేస్తాయి.

ఇప్పడు జ్ఞానస్నానమీయడానికి గురువు ప్రత్యేకంగా ఆశీర్వదించిన నీళ్ల వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం మామూలు నీళ్లు వాడవచ్చు.

2. మాటలు. పేత్రు యోహాను సమరియకు వచ్చి అచటి భక్తులమీద చేతులుచాచి వాళ్లు ఆత్మను పొందాలని ప్రార్థించారు - అచ 8, 15, 17. ఈ విధంగా సంస్కారాలు జరిగించేప్పడు బైబుల్లో కొన్ని పరిశుద్ధ క్రియలూ వాటితోపాటు కొన్ని మాటలూ వాడ్డం పరిపాటి. జ్ఞానస్నానంలో నొసటిమీద నీళ్లుపోయడం పరిశుద్ధ క్రియ. "పిత పత్ర పవిత్రాత్మల నామంమీదిగా నేను నీకు జ్ఞానస్నానమిస్తున్నాను" అని చెప్పడం కొన్ని మాటలను వాడడ మౌతుంది. ఈ పలుకులు మత్తయి 28, 19 నుండి గ్రహింపబడ్డాయి. ఈ పలుకు ద్వారా మనం పిత పత్ర పవిత్రాత్మలనే ముగ్గురు వ్యక్తులతో గూడిన దైవకుటుంబంలోనికి ప్రవేశించి దైవజీవితం జీవిస్తామని అర్థం చేసికోవాలి.

5. జ్ఞానస్నానాన్ని ఇచ్చేవాడు, పొందేవాడు

1. జ్ఞానస్నానాన్ని ఎవరీయవచ్చు? అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా, క్రైస్తవేతరులుకూడ ఈయవచ్చు. కాని వీళ్లు పైన పేర్కొన్న నీటినీ మాటలనూ వాడాలి. జ్ఞానస్నానమిచ్చేప్పడు తిరుసభకు ఏలాంటి ఉద్దేశముంటుందో అలాంటి ఉద్దేశంతోనే తామూ దాన్నీయాలి. అప్పడే ఈ పుణ్యక్రియ చెల్లేది. మామూలుగా రక్షణం పొందడానికి జ్ఞానస్నానం అవసరం. కనుక మరణాపాయంలాటి అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఎవరైనా ఈయవచ్చునని నియమం చేసారు. అయితే, మామూలు పరిస్థితుల్లో ఈ సంస్కారాన్ని జరిగించేవాళ్లు గురువులూ డీకన్లూను. జ్ఞానస్నానం తిరుసభ కార్యం. అది మనలను తిరుసభలో సభ్యులనుగా చేస్తుంది. కనుక తిరుసభ ప్రతినిధియైన గురువు తిరుసభ పేరటనే దాన్ని జరిపించడం సమంజసం.