పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్ఞానస్నానం ద్వారా జరుగుతుంది. అది పాపక్షమనూ హృదయ పరివర్తనాన్నీ సూచిస్తుంది - మార్కు 1,4. ఈ జ్ఞానస్నానం పొందినవాళ్ళంతా ఒక వర్గంగా తయారయ్యారు. ఐనా యోహాను జ్ఞానస్నానం మన నూత్నవేద జ్ఞానస్నానంలా పాపాలను పరిహరించేది కాదు. కేవలం పాపపరిహారాన్ని సూచించేది, అంతే. యోహాను స్వయంగా "నేనైతే మీకు నీళ్ళతో జ్ఞానస్నానమిస్తున్నాను. నా తర్వాత వచ్చేవాడు నాకంటే అధికుడు. ఆయన మీకు ఆత్మతోను అగ్నితోను జ్ఞానస్నానమిస్తాడు" అని చెప్పాడు - మత్త 3,11. యోహాను జ్ఞానస్నానం మెస్సియావల్ల లభించే నూత్నవేద జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది. పూర్వవేద జ్ఞానస్నానాలన్నీటిలోను అతనిది నూత్న వేదానికి అత్యంత సన్నిహితమైంది. నూత్నవేద జ్ఞానస్నానం క్రీస్తు మరణ్ణొత్దానాలు ద్వారా పని చేస్తుంది. అది పాపాలను పరిహరిస్తుంది. ఆత్మను ప్రసాదిస్తుంది. క్రొత్తపుట్టవునిస్తుంది, దైవకుటుంబంలోనికి ప్రవేశించేలా చేస్తుంది. యోహాను జ్ఞానస్నానానికి ఈ లక్షణాలు లేవు.

3. క్రీస్తు జ్ఞానస్నానాన్ని ఎప్పడు స్థాపించాడు ?

ప్రభువు యోర్దాను నదిలో స్నాపక యోహాను నుండి జ్ఞానస్నానం పొందాడు - మత్త 3, 13-17. నరుడు నీటిద్వారాను ఆత్మద్వారాను క్రొత్తగా జన్మిస్తేనేగాని దైవరాజ్యంలో చేరడని నికొదేమతో నుడివాడు - యోహా 3,15, క్రీస్తు శిష్యులూ యూదులకు జ్ఞానస్నాన మిచ్చారు - యోహా 3, 22-26. కడన ప్రభువు ఉత్దానానంతర0 శిష్యులను జ్ఞానస్నాన మీయండని ఆజ్ఞాపించాడు. సమస్త జనాన్ని తన శిష్యులనుగా జేసి పిత పత్ర పవిత్రాత్మ పేరుమీదిగా వాళ్ళకు జ్ఞానస్నానమీయండని ఆదేశించాడు - మత్త28,19. ఈ సంఘటనల ద్వారా క్రీస్తు జ్ఞానస్నానావసరాన్ని దాని స్వభావాన్నీ దాన్ని పాటింపవలసిన తీరునీ వివరించాడు. దాన్ని స్థాపించాడు గూడ.

4. నీళ్లు, మాటలు

ఇప్పడు జ్ఞానస్నానం పొందేవ్యక్తి నొసటిమీధ మూడుసార్లు నీళ్ళుపోసి "పిత పుత్ర పవిత్రాత్మ పేరుమీదిగా నీకు జ్ఞానస్నానమిస్తున్నాను" అని చెప్తాం. 1. నీళ్ళ తొలిరోజుల్లో నీళ్లల్లో మంచి జ్ఞానస్నానమిచ్చేవాళ్ళ - అచ 8, 38. రోమా 8,4 నూత్నవేదం స్పష్టంగా చెప్పకపోయినా, తలమీద నీళ్ళుపోసి జ్ఞానస్నానమిచ్చే పద్ధతికూడ తొలిరోజుల్లోనే వుండివుంటుంది. ఉదాహరణకు అననీయా పౌలుకి యూదా అనేవాని యింటిలోనే జ్ఞానస్నాన మిచ్చాడు - అచ 9,11,18, ఫిలిపిలో పౌలు చెరసాల