పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాళ్ళల్లో సమరయులు 8, 12, యితియోపీయుడు 8,38, పౌలు 9,18, కొర్నేలి, 10,48, లూదియా 16,15 మొదలైనవాళ్ళు ముఖ్యులు.

ఇక పేత్రు మొదటి జాబు జ్ఞానస్నాన సందర్భంకొరకే వ్రాయబడిందని పండితుల భావం. ఈ లేఖ చాల తావుల్లో ఈ క్రియను పేర్కొంటుంది. ఉదాహరణకు 2,9-10 వాక్యాలు మనం జ్ఞానస్నానం ద్వారా చీకటి నుండి వెలుగులోనికి ప్రవేశిస్తామని చెప్తాయి. దేవుని బిడ్డలమై అతన్ని ఆరాధిస్తామని వాకొంటాయి.

ప్రార్థనాభావాలు

1. మనం పిత పుత్ర పవిత్రాత్మల నామంలోనికి జ్ఞానస్నానం పొందుతాం. దీనిద్వారా దైవకుటుంబములోనికి ప్రవేశిస్తాం, దేవునికి బిడ్డలమై దివ్యజీవితం జీవిస్తాం. నరుడు దేవుని జీవితం జీవించడం సామాన్యమైన భాగ్యం కాదు. నక్క యొక్కడ నాకలోక మెక్కడ? ఈ గొప్పవరానికిగాను మనం సదా కృతజ్ఞలమై యుండాలి.

2. జ్ఞానస్నానం నిజంగా స్నానం. బాప్టిట్టేయిన్ అనే గ్రీకు క్రియకు ముంచడం, కడగడం అనే అర్థాలున్నాయని చెప్పాం. స్నానం మనదేహాన్ని కడిగి శుద్ధిచేసినట్లే ఈ సంస్కారం మన ఆత్మను కడిగిశుద్ధిచేస్తుంది. దానిలోని పాపమాలిన్యాన్ని తొలగిస్తుంది. ఈ యర్ధంలోనే పౌలు దీన్ని "స్నానం" అని పేరొన్నాడు - ఎఫే 5, 26. ఈ పవిత్ర స్నానానికిగాను దేవునికి వందనశతా లర్పించాలి.

3. జ్ఞానస్నానంలో మనం క్రీస్తుతో ఎలా చనిపోయి ఎలా ఉత్థానమౌతాం అని ప్రశ్నించుకొని అలెగ్జాండ్రియాసిరిల్ భక్తుడు ఈలా వ్రాసాడు. “మనం జ్ఞానస్నానపు నీళ్ళలోనికి దిగినప్పుడు భౌతికంగా చనిపోము. భౌతికంగా భూస్థాపితం కాము. భౌతికంగా ఉత్థానంకాము. ఇక్కడ మనం క్రీస్తు మరణిజ్ఞానాలను అనుకరిస్తాం, అంతే. ఈయనుకరణంద్వారా మనకు రక్షణం మాత్రం యథార్థంగా లభిస్తుంది. క్రీస్తయితే సిలువమీద నిజంగా చనిపోయాడు. నిజంగా సమాధిలో భూస్థాపితు డయ్యాడు. నిజంగానే అక్కడినుండి మళ్లా ఉత్తానుడయ్యాడు. మనపట్లగల ప్రేమచేత ఆయనీ బాధలన్నిటికీ పాల్పడ్డాడు. ఈనాడు మనం ఆయన బాధలను అనుకరించి రక్షణం పొందుతున్నాం. యథార్థంగా బాధలు అనుభవించినవాడు ఆయన. ఆ
బాధలతో ఐక్యంగావడంవల్ల, మనం స్వయంగా బాధలను అనుభవించకపోయినా, అతడు మనకు రక్షణాన్ని దయచేస్తున్నాడు. ఇది వింతలలోకెల్ల వింతకాదా?