పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ వరం యోహానుని ప్రభావితం చేసింది. అతడు క్రీస్తుద్వారా తండ్రి మనపట్ల చూపిన ప్రేమకు ముగ్గుడైపోయాడు. భక్తిభావంతో "దేవుడంటే ప్రేమే" అని వాకొన్నాడు - 1యో 4,8.

ఈ వరం ఎమ్మావు త్రోవలో శిష్యులమీద సోకింది. వాళ్లు తన్మయులైపోయారు. “అతడు మార్గంలో మనతో మాట్లాడుతూ లేఖనాలను వివరిస్తూంటే మన హృదయం ప్రజ్వరిల్లింది కదా? అనుకొన్నారు - లూకా 24, 32.

2. ఈ వరం ఫలితాలు

ఈవరంవల్ల మన హృదయంలో దేవునిపట్ల గాఢమైన భక్రీ, అనుభూతీ, ప్రేమా పడతాయి. "మోక్షంలో మాత్రం నీవు తప్ప ఇంకెవరున్నారు? ఈ లోకంలో నీవు తప్ప మరొకటి నాకు రుచించడం లేదు" అన్నాడు కీర్తనకారుడు - 73, 25. "ప్రభూ! నిత్యజీవం ఇచ్చే పలుకులు నీ నోటి నుండి వెలువడుతున్నాయి. నిన్ను కాదని మరెవరి దగ్గరికి వెళ్తాం? లోకంలోకి వెళ్లి అక్కడ యేమి పాముకొంటాం గనుక?" అన్నాడు పేత్రు - యోహా 6,68. "ఇప్పడు నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అన్నాడు పౌలు - గల 2,20, ఈ భక్తులకు గలిగిన అనుభూతే మనకూ కలుగుతుంది.

తెలివితేటలుకల పండితులమీద మాత్రమేకాదు, చదువు సంధ్యలూ పుస్తకజ్ఞానమూలేని పామరజనంమీద కూడ ఈ వరం పనిచేస్తుంది. విద్యవిజ్ఞానంలేని ఒక పేద ముసలమ్మ వుంది. ఆమె భక్తరాలు. పరలోక జపాన్ని ప్రారంభించేది కాని ముగించలేకపోయేది. దానికి కారణం ఆమే యిూలా చెప్పింది. "పరలోకంలోని మా యొక్క తండ్రి అన్న వాక్యాన్ని ప్రారంభించగానే దేవుడంతటివాడు నాకు తండ్రికదా అనే భావం స్ఫురిస్తుంది. దానితో నా కన్నులవెంట గిర్రున నీళ్ళ తిరుగుతాయి. ఇక నేను ఆ జపాన్ని ముగించలేను. దినమంతా ఆ భావాన్నే నెమరు వేసికొంటూ భక్తితో ఆలాగే వుండిపోతాను. ఇప్పటికి ఐదేళ్ళబట్టి ఈలా జరుగుతూంది". ఈ దైవానుభూతి విజ్ఞాన వరంవల్లగాకపోతే మరి దేనివల్ల కలిగింది?

ఈ వరం మన మీద సోకనంత కాలం, భగవంతుడు మనకు వట్టి భావంగానే . వుండిపోతాడు. మన సత్యాలు బైబులు బోధలు వట్టి సిద్ధాంతాలుగానే వండిపోతాయి. మన హృదయం ఎండిపోయిన నేలలా, మోడువారిన కొర్రులా వుంటుంది, ఆ దేవునికీ మనకీ ఏమి సంబంధముందో కూడ గ్రహించలేం, కాని ఓమారు ఈ వరం మనమీద సోక్షగానే మన హృదయం ద్రవిస్తుంది. భగవంతుడు వట్టి భావంగాగాక, ఓ వ్యక్తిగా అనుభవానికి వస్తాడు. అతన్ని తండ్రిగాను, రక్షకుణ్ణిగాను, మన సర్వస్వంగాను భావిస్తాం. హృదయంలో ప్రేమ పుడుతుంది. ప్రార్ధనం పెల్లుబికివస్తుంది. మనలను మనం