పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. సప్తవరాలు

బైబులుభాష్యం 71-78

విషయసూచిక

  1. సదుపదేశం 68
  2. దైవభక్తి 72
  3. దృఢత్వం 75
  4. దైవభీతి 77
  5. తెలివి 79
  6. వివేకం 82
  7. విజ్ఞానం 84
  8. వరాల వివరణం 86

ప్రశ్నలు 89

1, సదుపదేశం

1. సదుపదేశం అంటే యేమిటి?

ఆత్మ మనకు దయచేసే వరాల్లో సదుపదేశం కూడ వొకటి. ఈ వరం ద్వారా కష్టమైన పరిస్థితులూ గడ్డుసమస్యలూ ఎదురైనపుడు మంచి నిర్ణయాలు చేసికొనే శక్తిని పొందుతాం. జీవితంలో బోలెడన్ని సమస్యలు ఎదురౌతూంటాయి. వాటి నేలా పరిష్కరించుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు చేసికోవాలో మన కట్టే తెలియదు. ఆలాంటి పరిస్థితుల్లో ఈ వరం మనకు వెలుగుని ప్రసాదిస్తుంది. ఆత్మేమన హృదయంలో మాటలాడి సలహా చెప్తుంది. దానివల్ల మనం సమస్యను అర్థంచేసికొంటాం. తగిన నిర్ణయాలు చేసికొంటాం. కార్యాచరణకు పూనుకొంటాం.

ప్రభువు "మీరు న్యాయస్థానాలకు అప్పగింపపడినపుడు ఏవిధంగా మాట్లాడాలా, ఏమి చెప్పాలా అని కలత చెందకండి. ఆ సమయానికి తగినరీతిగా చెప్పవలసిందల్లా మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు మాట్లాడే మాటలు మీవి కావు. మీ తండ్రి ఆత్మే మీ నోట మాట్లాడుతుంది" అన్నాడు - మత్త 10, 19. ఇక్కడ సందర్భం వేదహింసలు. ఐనా ఒక్క వేద హింసలు కాలంలోనే కాకుండ ఇతరావసరాల్లో కూడ ఆత్మ మనకు సలహా యిస్తూంటుంది.