పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. క్రీస్తు ఆత్మతో నిండినవాడని నిరూపించండి. 12. ఉత్తానక్రీస్తు మనకు ఆత్మను ఏలా యిస్తాడు? 13. ఆత్మ క్రీస్తుకి ఏలా సాక్ష్యం పలుకుతుంది? 14. ఆత్మ మరియను ఏలా నడిపించింది?

౩. తిరుసభలో ఆత్మ

15. క్రీస్తుతోపాటు ఆత్మడుకూడ తిరుసభను స్థాపించాడు - వివరించండి. 16. ఆత్మ మనలను క్రీస్తుతో ఏలా ఐక్యం చేస్తుంది? 17. దివ్యవ్యక్తి మనలో దేవుని పోలికను ఏలా కలిగిస్తాడు? 18. ఆత్మ మనకు దైవపుత్రత్వాన్ని ఒసగే తీరును తెలియజేయండి. 19 ఆత్మ మనలను ప్రేషిత సేవకు ఏలా పరికొల్పుతుంది? 20 ఆత్మ మనచే ఏలా ప్రవచనం చెప్పిస్తుంది? 21. ఏ మూడు దేవద్రవ్యానుమానాలైనా తీసికొని ఆత్మ వాటిల్లో పనిచేసే తీరును

      వివరించండి.

22. మన నైతిక జీవితానికి కర్త ఆత్మే - వివరించండి. 23. ఆత్మద్వారా మనం శారీరక వాంఛలను ఏలా జయిస్తాం? 24. దైవవ్యక్తి మనకు పాపపరిహారాన్ని ఏలా దయచేస్తాడు? 25. ఆత్మ మనచే ఏలా ప్రార్ధన చేయిస్తుంది? 26. ఆత్మ మనకు ప్రేమ, విశ్వాసం, నిరీక్షణం అనే దైవపుణ్యాలను ఏలా దయచేస్తుంది? 27. వేదవాక్యాన్ని అర్థంచేసికొనే శక్తిని ఆత్మ మనకు ఏలా దయచేస్తుంది? 28. ఆత్మ మనకు దయచేసే సప్త వరాలనూ సేవా వరాలనూ వివరించండి. 29. ఆత్మ ఫలాల్లో ఏ రెండిటినైనా తెలియజేయండి. 30. మన శ్రమల్లో మరణంలో ఆత్మ ఏలా ప్రత్యక్షమై వుంటుందో తెలపండి, 31. ఆత్మకుండే వినయం అంతా యింతా కాదు - వివరించండి. 32. ఆత్మ మనపట్ల ఏలా తల్లిగా మెలుగుతుందో తెలుపండి. 33. సత్రసాదం, పోపుగారు, మరియమాత - ఈ ముగ్గురు మనం పవిత్రాత్మను

     విస్మరించేలా చేయకూడదు - వివరించండి.

34. ఆత్మపట్ల మన బాధ్యతలు ఏమిటివి? 67