పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. దివ్యజ్యోతీ వేంచేయి. నిత్యజీవమూ దిగిరా. దాగియున్న దైవరహస్యమా విచ్చేయి. పేరులేని నిధీ రా, అనిర్వచనీయమైన భాగ్యమా దయచేయి. నరులు ఊహింపలేని దివ్యవ్యక్తీ దిగిరా. అనంతానందమా వేంచేయి. ఆరిపోని వెలుగా వేంచేయి. రక్షణం పొందేవారి ఆశా విచ్చేయి. నిద్రించేవారిని లేపే దివ్యశక్తి దిగిరా. చనిపోయినవారికి ఉత్థానమా రా. నీవు సోకినవారినెల్ల మార్చివేసే మహాశక్తి దిగిరా. సృష్టికర్తా దిగిరా. మేము చూడలేని, తాకలేని, గ్రహింపలేని శక్తి దయచేయి. నీవు కదలకుండానే మమ్ము కదిలించే శక్తి రా. స్వర్గంనుండి దిగివచ్చి చీకటిలోవున్న మమ్మదర్శించే ప్రభువా విచ్చేయి. అందరు ప్రీతితో ఉచ్చరించే దివ్యనామమా దిగిరా, శాశ్వతానందమా, నాశంగాని కిరీటమా దయచేయి. మారాజైన దేవుడు ధరించే నీలలోహిత వస్త్రమా విచ్చేయి. రత్నాలు పొదిగిన స్పటికపు వడ్డాణమా దిగిరా. గంధపు పరిమళమా విచ్చేయి. దేవుని కుడిపార్న్వాన ఆసీనుడవైయున్న ప్రభువా దిగిరా, నా నికృష్ణపు ఆత్మ సదా ఆశించే దేవా రా, వంటరిగా వుండేవాళ్ళకు ఉపశమనమా విచ్చేయి. హృదయంలోని కోరికవై నేను నిరంతరం కోరుకొనే భాగ్యమూర్తీ దయచేయి. నా వూపిరీ జీవమూ ఐన ప్రభూ వేంచేయి. నా ఆత్మకు శాంతి ఆనందమూ కిరీటమూ మహిమా ఐన ప్రభూ విచ్చేయి - నూత్న వేదాంతి సిమియోను,

ప్రశ్నలు

1. దేవుని ఆత్మ

1. ఆత్మ నామాలనూ, సంకేతాలనూ తెలియజేయండి.
2. పూర్వవేదంలో ఆత్మ దేవుని క్రియాశక్తిగా మాత్రమే కన్పిస్తుంది. నూత్నవేదంలో
   అతడు ఓ వ్యక్తిగా కన్పిస్తాడు - వివరించండి.
3 .ఆత్మ యేలా దేవుని క్రియాశక్తి ఔతుందో వివరించండి.
4. ఆత్మడు పవిత్రాత్ముడు ఎలా అయ్యాడు?
5.ఆత్మ మనకు ప్రేమశక్తిని ఏలా దయచేస్తుంది?
6. ఆత్మ మనకు జీవాన్ని ఏలా అందిస్తుంది? నీరు ఆత్మకు ఎందుకు చిహ్నమైంది?
7.పూర్వనూత్నవేదాల్లోని రక్షణచరిత్రను నడిపించేది ఆత్మేనని నిరూపించండి.
8.ఆత్మ కడపటిదినాల్లో దేవుడు మనకిచ్చే దానమని నిరూపించండి.

2. క్రీస్తుని ఆత్మ

9.

క్రీస్తుకీ ఆత్మకూ గల సంబంధాన్ని తెలియజేయండి
10.దేవుడు మూడు దశల్లో తన్ను గూర్చి తాను మనకు తెలియజేసికొన్నాడు – వివరించండి.

66 2.