పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుత్తుక నొక్కేసినట్లవుతుంది. ఆత్మవాళ్ళకిచ్చిన వరాలను వినియోగించుకోక వ్యర్థం చేసినట్లవుతుంది -1తెసు 5,19. భారతదేశం తిరుసభలో ఈయనర్ధం తరచుగా కలుగుతుంటుంది.

2. శ్రీసభలో అధికారమూ వుంది, ఆత్మ వరాలూ వున్నాయి. అధికారమున్నవాళ్ళు ఇతరులమీద పెత్తనం చెలాయింపబోతారు. వరాలున్నవాళ్ళు అధికారులకు లొంగకుండా విచ్చలవిడిగా ప్రవర్తించబోతారు. కాని మనం అధికారాన్నీ వరాలనూగూడ సద్వినియోగం జేసికొని తిరుసభను ఓ భవనంలా నిర్మించాలి. పూర్వం అధికారానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. ఇప్పడు వరాలకు ఎక్కువ ప్రాముఖ్యమిస్తున్నారు. ఐనా ఈ రెండూ సమపాళ్ళలో వుండాలి, అప్పడే తిరుసభ వృద్ధిలోకి వచ్చేది. ఈ శక్తులను మనం ఏనాడూ దుర్వినియోగం చేయగూడదు.


29. శాంతి సంతోషాలను ప్రసాదించే ఆత్మ

1. పిశాచం విచారానుభూతిని కలిగిస్తుంది. కాని పవిత్రాత్మఆనందానుభూతిని కలిగిస్తుంది. హృదయంలో శాంతిని నెలకొల్పుతుంది. ఆత్మఫలాల్లో సంతోషమూ శాంతికూడ వున్నాయి - గల 5,22. పౌలు బర్నబాలు అంతియోకయలో వేదప్రచారం చేస్తూంటే అచటి భక్తులు ఆత్మ ప్రభావంవల్ల శాంతి సంతోషాలతో నిండిపోయారు - అచ 13,52. డెబ్బదియిద్దరు శిష్యులు వేదబోధచేసి తిరిగి వచ్చాక పవిత్రాత్మ ప్రభావం వలన క్రీస్తు స్వయంగా ఆనందానుభూతి చెందాడు — లూకా 10,21.

నేడు ఉత్థానక్రీస్తు తన ఆత్మద్వారా మనకు శాంతినీ సంతోషాన్నీ దయచేస్తాడు. అతడు ఉత్థానమైన పిమ్మట యెరూషలేములోని శిష్యులకు ఈ భాగ్యాలను దయచేసాడని వింటున్నాం - యోహా 20,19-20. పౌలు ఫిలిప్పిలోని క్రైస్తవులకు మీ రెల్లప్పుడూ ఆనందించండని చెప్పాడు - ఫిలి 4,4. క్రైస్తవులమైన మనం మన నాయకుడైన క్రీస్తుని తలంచుకొని ఆనందించాలి. ఈ లోకం కేవలం కన్నీటి కనుమ మాత్రమేకాదు. దేవుడు తన బిడ్డలమైన మనకు ఇక్కడ ఆనందాలు కూడ దయచేస్తాడు. ఈ యానందాలూ సంతోషాలూ భవిష్యత్తులో మనం అనుభవించబోయే మోక్షానందానికి గుర్తుగావుంటాయి. ఈ లోకంలో కొన్ని ఆనందాలు లేకపోతే బ్రతుకు దుర్భరమౌతుంది. కనుక దేవుడు వీటిని మనకు దయచేస్తాడు. ఐతే నిర్మలమైన ఆనందాలన్నిటికీ కర్త పవిత్రాత్మే ఉత్తానక్రీస్తు ఆత్మ మనం క్రీస్తునందు ఆనందించేలా చేస్తుంది. పుణ్యజీవితం గడపడంద్వారా, తోడిప్రజలను సేవలు చేయడం