పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తవరాలనిస్తుందని చెప్తుంది, కాగా ఆ మెస్సీయాను విశ్వసించే భక్తులకు కూడ ఈ వరాలు లభిస్తాయని మనం నమ్మవచ్చు. ప్రాచీన కాలంనుండి క్రైస్తవభక్తులు ఈలాగే విశ్వసిస్తూ వచ్చారు. ఈ యేడు వరాలూ వ్యక్తిగత పావిత్ర్యం కొరకు ఉద్దేశింపబడినవి. కనుక వీటిద్వారా ఆత్మ మనలను పవిత్రులను చేస్తుంది. అసలు వరాలు ఎన్ని? బైబులూ క్రైస్తవ సంప్రదాయమూ ఏడని చెప్తుంది. కాని బైబుల్లో ఏడు పూర్ణసంఖ్య అనగా ఈ యేడు ఆత్మయిచ్చే వరాలన్నిటినీ సూచిస్తాయి. ఆత్మ వరాలన్నీ ఈ యేడింటిలో ఇమిడివున్నాయని భావం. ఆత్మవరాలు ఎన్నయినా వుండవచ్చు. కాని అవన్నీ ఈ యేడింటిలో ఇమిడే వుంటాయి. 2. పౌలు తన జాబుల్లో చాలచోట్ల ఆత్మ ఎన్నోవరాలు దయచేస్తుందని చెప్పాడు. కాని యీ వరాలు పై యెషయా పేర్కొన్నవాటిలాగ వ్యక్తిగత పావిత్రానికి ఉపయోగపడవు. మనం ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగపడతాయి. కనుక వీటిని సేవావరాలు లేక ప్రేషిత వరాలు అన్నారు (Charisms). 1కొ 12,7-10.28. రోమా 12,6-8. ఎఫే 4, 11 వచనాల్లో వీటి ప్రస్తావనం వస్తుంది. ఈ యాలోకనాల్లో పౌలు ఇంచుమించు ఇరవై వరాలదాకా పేర్కొన్నాడు. అవి బుద్ధి, జ్ఞానం, విశ్వాసం, స్వస్థత చేకూర్చడం, అద్భుతాలు చేయడం, ప్రవచనం చెప్పడం, భాషల్లో మాటలాడ్డం, వివేచనం, పరిచర్య ప్రోత్సహించడం, దానం చేయడం, పర్యవేక్షణం, కరుణకార్యాలు, సువార్త చెప్పడం, కాపరులుగా, అపోస్తలులుగా, సహాయకులుగా, పరిపాలకులుగా మెలగడం మొదలైనవి. మనం ఈ సేవావరాలను విరివిగా వాడుకొని తోడిప్రజలకు, విశేషంగా పేదసాదలకు పరిచర్య చేయాలి. వారిని వృద్ధిలోనికి తీసికొని రావాలి. ఈ పరిచర్యద్వారా మనం నేరుగా కాదుగాని పరోక్షంగా పవిత్రులమౌతాం. 3. ఆత్మ పైరెండు రకాల వరాలనేకాక ఫలాలను కూడ దయచేస్తుంది. ఇవి తొమ్మిది వున్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం. విశ్వసనీయత, సాధుశీలత, ఇంద్రియ నిగ్రహం - గల 5,22. ఈ ఫలాలవల్ల హృదయంలో సంతోషమూ మాధుర్యభావమూ నెలకొంటాయి. ఇవి సప్తవరాలకంటెగూడ శ్రేష్టమైనవి.


ప్రార్ధనా భావాలు

1. శ్రీసభలో అధికారమనేది వుంది. శ్రీసభ అనే సమాజం మేలుకొరకు పవిత్రాత్మే దీన్ని ప్రసాదించింది. ఐనా శ్రీసభలోని అధికారులు తరచుగా ఈ శక్తిని దుర్వినియోగం చేస్తుంటారు. అలా చేసినప్పుడు తిరుసభలోని సామాన్యక్రైస్తవుల