పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16,13. క్రీస్తు తెలియజేసే దివ్యశ్రుతే ఈ సత్యం, అనగా అతడు తండ్రినిగూర్చి తెలియజేసే అంశాలే సత్యం. అసలు క్రీస్తే సత్యం. ఈ సత్యం మనకు అర్థమయ్యేలా చేసేది ఆత్మడే. 3. మనం వేదబోధ చేస్తాం, శ్రోతలు మన బోధ వింటారు. అలా వినగానే ఆత్మ వాళ్ళ హృదయాలను కదిలిస్తుంది, దీని ఫలితంగా శ్రోతల హృదయాల్లో భక్తి విశ్వాసాలు పుడతాయి. లేకపోతే వాళ్ళ క్రీస్తుని గ్రహించలేరు. పౌలుకి ఈ సత్యం బాగా తెలుసు. కనుకనే అతడు తన వేదబోధను ప్రజలు బాగా ఆలించేలా ప్రార్థించమని తన క్రైస్తవులను అర్ధించాడు - కొలో 43. ఆత్మ లేందే దేవద్రవ్యానుమానాలు పని చేయవు. దైవవాక్కుకూడ ఓ దేవద్రవ్యానుమానంలాంటిది. కనుక ఆత్మలేందే బైబులు పనిచేయదు. పూర్వనూత్నవేదాలు క్రీస్తునే బోధిస్తాయి. ఈలాంటి వేదవాక్యాలను ఆత్మ సహాయం లేందే ఎవరు అర్థంచేసికోగలరు? ఆత్మడు అనుగ్రహించందే ఎవడు క్రీస్తుని గ్రహించగలడు? కనుక మనం ఎప్పడుకూడ ఆత్మను వేడుకొనిగాని వేదవాక్యాన్ని ధ్యానించుకోగూడదు.

ప్రార్ధనా భావాలు

1. ముగ్గురు దైవవ్యక్తులనుగూర్చి నీసా గ్రెగొరీ భక్తుడు ఈ వుపమానం చెప్పాడు. "మొదటి ఒక దీపం వుంది, దానినుండి రెండవ దీపాన్ని వెలిగించారు. ఆ రెండవ దానినుండి మూడవ దీపాన్ని వెలిగించారు. ఈ మూడవ దీపం మొదటి రెండిటినుండీ వచ్చిందే. అదే ఆత్మ". 2. న్యూడో డయెనీష్యస్ అనే భక్తుడు ఈ వుపమానం చెప్పాడు. “అన్నిటికి మూలకారణమైన తండ్రి చెట్టు లాంటివాడు. క్రీస్తూ పవిత్రాత్మా ఆ చెట్టునుండి పట్టే మొగ్గలూ పూలూ అనుకోవాలి."

28. వరాలు దయచేసే ఆత్మ

ఆత్మ భక్తులకు నానావరాలు దయచేస్తుంది. వీటి ద్వారా భక్తులు భగవంతునికి చేరుమోతారు. ఇక్కడ ఈ వరాలనుగూర్చి విపులంగా తెలిసికొందాం. 1. ఆత్మ మెస్సీయా శిశువుకు ఆరు వరాలు దయచేస్తుందని చెప్పాడు యెషయా ప్రవక్త. ఈ వరాలు విజ్ఞానం, వివేకం, బలం, సదుపదేశం, దైవజ్ఞానం, దైవభీతి 11.2-3. ఇక్కడ హీబ్రూ బైబులు ఆరువరాలనే పేర్కొన్నా దీని అనువాదమైన గ్రీకు సెపవాజింత్ బైబులు దైవభక్తి అనే ఏడవ వరాన్నిగూడ పేర్కొంది, దీనివల్ల ఆత్మసప్తవరాలు దయచేస్తుందనే సంప్రదాయం వాడుకలోకి వచ్చింది. బైబులు ఆత్మ మెస్సీయాకు