పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-2తిమో 1,14. ఈలాగే నేడు మనంకూడ వేదబోధను కల్తీచేయకూడదు. తొలినాటి వేదబోధకులు ఏ సందేశాన్ని విన్పించారో, దాన్ని మాత్రమే మనం ప్రజలకు తెలియజేయాలి. ఆత్మ మనతోవుండి మనం కల్తిలేని వేదబోధ చేసేలా సాయపడుతుంది.

ప్రార్థనా భావాలు

1. 6సిరియా సీమోను భక్తుడు ఓ గీతంలో ఆత్మను గూర్చి ఈలా వ్రాసాడు.
 ఆత్మమా! నీవేలా అనలంగాను
 శీతలంగాను గూడ వుంటావు?
 నీవు చీకటిని వెలుగునుగాను
 మృత్యువుని జీవంగాను
 నరుణ్ణి దేవుణ్ణిగాను ఏలా మార్చుతావు?
 నీవు మా హృదయాల్లోకి ప్రవేశించి
 మా అంతరంగాన్ని ఏలా మార్చుతావు?
 మా దుఃఖాన్ని ఏలా ఆనందంగా చేస్తావు?
 నీవు మాతో ఎలా వసిస్తావు?
మా పాపాలకు ఏలా కోపించకుండా వుంటావు?
 మమ్మేలా భరిస్తావు?
 మహోన్నతంలో వసించే నీవు
 భూమిమీది మా చర్యలను ఏలా గమనిస్తావు?

2. ఆత్మ మనమీదికి దిగివచ్చినపుడు గొప్ప నెమ్మదీ శాంతీ ఆనందమూ కలుగుతాయి. దీన్ని పురస్కరించుకొనే క్రీస్తు లోకం ఈయలేని శాంతిని నేను మీకు ఇస్తానని వాకొన్నాడు - యోహా 14,27.

20. ప్రవచనం చెప్పించే ఆత్మ

1. ప్రవక్తలు విశేషంగా పవిత్రాత్మచే ప్రబోధితులైనవాళ్ళు. ఆత్మ వారిద్వారా మాట్లాడింది. "ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని చెప్పారు" - 2షేత్రు 1,21. పూర్వం మోషే ప్రజలందరూ ఆత్మనుపొంది ప్రవచనం చెప్పాలని కోరాడు - సంఖ్యా 11,29. యోవేలు ప్రవక్తకూడా నరులందరూ ఆత్మనుపొంది ప్రవచనం చెప్తారని పల్మాడు - అచ 2,17. ప్రభువు తన ప్రజలను ప్రవక్తలనుగాజేసి వారికి ఉపదేశం