పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యూదులు తాము దేవుని బానిసలమనుకొన్నారు. ఆ దేవుణ్ణిచూచి భయపడ్డారు. కాని నూత్నవేదంలో మనం దేవునికి బానిసలమనుకోము. బిడ్డల మనుకొంటాం. దేవునిపట్ల యూదులకు లేని చనువు మనకుంది.

దేవుడు ఆదామని తన్నుపోలిన వాడ్డిగా చేసాడు. అతనికి దేవుని కుమారుడని పేరు - ఆది 5,1. నూత్నవేదంలో మనం క్రీస్తుద్వారా దేవుని కుమారులమూ కుమార్తెలమౌతాం. కాని క్రీస్తుద్వారా మనలను దేవుని బిడ్డలను చేసేది మాత్రం పవిత్రాత్మే క్రీస్తు దేవునికి సహజపుత్రుడు. మనం దత్తపుత్రులము మాత్రమే. ఇక ఈ దత్తపుత్రత్వాన్ని మనకు దయచేసేది పవిత్రాత్మే ఆత్మద్వారానే క్రీస్తు దేవునికి కుమారుడయ్యాడు. ఆ యాత్మద్వారానే మనంకూడ కుమారునియందు కుమారులమౌతాం - గల 4,5-7.

2. సత్యస్వరూపియైన ఆత్మ మీలో వుంటాడు అని చెప్పాడు ప్రభువు - యోహా 14,17. పవిత్రాత్ముడు మనలో వసిస్తుంటాడని ఈ వాక్యం భావం. పూర్వవేదంలోని ఏ భక్తుడుకూడ, ఏ ప్రవక్తకూడ, పవిత్రాత్ముడు తనలో వసిస్తున్నాడని చెప్పకోలేదు. వాళ్ళు ప్రభువు సాన్నిధ్యం తమతో వుంటుందని నమ్మారు. అది తమలో వుందనుకోలేదు. ప్రవక్తల్లో ఆత్మ క్రియాశక్తీ, ప్రేరణమూ వున్నమాట నిజమే. కాని ఆత్మే తమలో వుందని ప్రవక్తలు భావించలేదు. నూత్న వేదంలో పవిత్రాత్ముడు మనలో ఓ వ్యక్తిగా వసిస్తాడు. త్రీత్వంలోను క్రీస్తులోను ఉన్నట్లే అతడు మనలో కూడ వుంటాడు. ఈలావుండి మనలను దేవుని పత్రులనుగా జేస్తాడు. ఈ దివ్యనివాసం పూర్వవేదంలోని భక్తుల్లో లేదు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యేక భాగ్యం.

3. బిడ్డలు తండ్రి ఆస్తికి హక్కుదారులౌతారు. మన తండ్రి దేవుడు. అతని ఆస్తి మోక్షం. కనుక మనం దేవుని బిడ్డలమై అతని మోక్షానికి వారసులమౌతాం, కాని మనం మోక్షానికి వారసులమయ్యేలా చేసేది మాత్రం పవిత్రాత్మే కనుకనే పౌలు " దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్లానాన్ని మనం పొందుతాం అనడానికి ఆత్మే హామీ" అని వాకొన్నాడు - ఎఫే 1, 14 దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానం మోక్ష బహుమానమే. దీన్ని మనం సంపాదించుకొంటాం అనడానికి ఆత్మే మనకు హామీగా వుంటుంది. ఇక్కడ "హామీ" అంటే బయానా లేక సంచకరువు, క్రయవిక్రయాల్లో బయానా ఇచ్చినవాడు తర్వాత పూర్తిసామ్ముగూడ చెల్లిస్తాడు. ఆలాగే ఆత్మ ఈ లోకంలోనే మనకు మోక్షాన్ని కొంతవరకు ఇప్పిస్తుంది. మన మరణానంతరం ఆ మోక్షం మనకు పూర్తిగా దక్కేలా చేస్తుంది. కనుకనే