పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్మ క్రీస్తుని ఎడారికి నడిపించింది - లూకా 4,1. నేడు తన బిడ్డలమైన మనలను నడిపిస్తుంది - రోమా 8,14. అలాగే మరియనుకూడ నిరంతరం దైవమార్గంలో నడిపించింది.

2. గబ్రియేలు మంగళవార్తను విన్పించినపుడు మరియ దేవుని రక్షణ ప్రణాళికతో సహకరించింది. విశ్వాసంతో దేవుని చిత్తానికి లొంగింది. ఈ సందర్భంలో పవిత్రాత్మే ఆమె విశ్వాసాన్ని బలపరిచింది. ఆత్మ ఆమె మీదికి ఓ మేఘంలా దిగివచ్చింది — లూకా 1,35. ఆ దివ్యశక్తివల్లనే ఆమె గర్భవతి ఐంది, ఆమె కుమారుడు పవిత్రుడయ్యాడు.

ఎలిసబేతును సందర్శించినపుడు ఆమె ఆత్మశక్తితో ప్రవచనం చెప్పింది. ఆ ప్రవచనమే మహిమగీతం. ఆ పాటలో ఆమె దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించాడు అని చెప్పుకొంది. ప్రభువు గర్వితులను అణగదొక్కి దీనులను పైకి లేపేవాడు.

మరియ జీవితకాలంమంతా ఆత్మ ఆమెను నడిపిస్తూనే వచ్చింది. ఆ దివ్యశక్తి మరియను ప్రేరేపించి ఆమె క్రీస్తు జీవిత సంఘటనల భావాన్ని లోతుగా ఆలోచించి చూచుకొనేలా చేసాడు — లూకా 2,19,51.

క్రీస్తు సిలువపై చనిపోయేపుడు ఆ తల్లి సిలువ క్రింద నిలచివుంది. ఆమె తన మనసులో ఫెూరబాధలు అనుభవిస్తూ కుమారుని తండ్రికి సమర్పించింది. కొందరు పునీతుల భావాల ప్రకారం, ఈ సందర్భంలో ఆమె అనుభవించినంత వేదన ఏ నరుడూ అనుభవించలేదు. కాని ఈ బాధను అనుభవించే శక్తి ఆత్ముడే ఆమెకు దయచేసాడు.

ఆత్మ దిగిరాకముందు మరియ శిష్యులతో గలసి మీదిగదిలో ఆత్మ రాకడకొరకు ప్రార్ధించింది - అ,చ,1,14. ఈ కార్యం ఆత్మ ప్రేరణం వల్లనే జరిగింది.

మరియ ఉత్థాపనంలోకూడ ఆత్మశక్తి వుంది. ఆత్మ అనుగ్రహం వల్లనే ఆమె దేహం శిధిలం కాకుండా మోక్షానికి కొనిపోబడింది. జీవనదాతయైన ఆత్ముడు ఆమె మృతదేహానికి శాశ్వతజీవాన్ని దయచేసాడు. ఈలా ఆమె దేహంలోని ప్రతి ముఖ్యసంఘటనంలోను ఆత్మ ప్రభావం వుంది.

3. కాని పవిత్రాత్ముడు కన్య గర్భంలో క్రీస్తు శిశువుని ఏలా రూపొందించాడు? పవిత్రాత్మడు క్రీస్తుకి ముందుగా పోయేవాడు. అతనికి మార్గం సిద్ధంజేసేవాడు. మరియ దేవదూత సందేశాన్ని విని అంగీకరించగానే ఆత్ముడు ఆమె గర్భంలో యేసు శిశువుని రూపొందించాడు, మరియ మొదట పవిత్రాత్మను తన హృదయంలో ధరించింది. ఆ దివ్యవ్యక్తి ఆమెకు పరిపూర్ణ జీవాన్నిచ్చి జీవమయుడైన క్రీస్తు ఆమెనుండి జన్మించేలా చేసాడు. ప్రాచీన క్రైస్తవులు ఆమెను "పవిత్రాత్మకు ప్రియురాలు" అని పేర్కొన్నారు. ఆత్మడు