పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. క్రీస్తుని ఆత్మ

10.క్రీస్తూ-ఆత్మా

1. పౌలు క్రీస్తు నుద్దేశించి "ఆత్మయైన ప్రభువు" అని పేర్కొన్నాడు. "ప్రభువే ఆత్మ" అన్నాడు – 2కొ 3,17-18, ఇక్కడ క్రీస్తు ఆత్మ అయిపోయాడని భావం కాదు. ఆత్మతో సంపూర్ణంగా నిండిపోయాడని మాత్రమే అర్థం. క్రీస్తు దేవుని కుమారుడైనట్లే, ఆత్మ క్రీస్తు ఆత్మ ఔతుంది. క్రీస్తు ఉత్తానంలో ఆత్మ సంపూర్ణంగా గోచరిస్తుంది.

2. పూర్వవేదంలో మెస్సీయా ఆత్మతో నిండిపోయాడు. “దేవుని ఆత్మ అతనిపై నిలుస్తుంది" అన్నాడు యెషయా 11.2 క్రీస్తు ఆత్మద్వారానే జన్మించాడు. జ్ఞానస్నానంలో ఆత్మడు అతనిపై దిగివచ్చాడు - యోహా 1,32. పూర్వం సంసోను సౌలు దావీదు మొదలైన యుద్ధవీరులమీదికి దిగివచ్చినట్లే ఆత్మడు మెస్సీయామీదికి గూడ దిగివచ్చాడు, క్రీస్తు అతనియందు ఆనందించాడు - లూకా 10,21. ఆత్మతోనే పిశాచాలను తరిమివేసాడు - 11,20
3. క్రీస్తకీ ఆత్మకీ దగ్గరి సంబంధం వుంది. ఇద్దరూ మన దగ్గరికి వస్తారు. ఆత్మను తండ్రి పంపుతాడు. "నేను తండ్రిని ప్రార్ధిస్తాను, మీతో ఎల్లపుడూ వుండడానికి మరొక ఆదరణ కర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు" - యోహా 14,16. కాని క్రీస్తు తనంతట తానే మన దగ్గరికి వస్తాడు. "నేను మిమ్మ అనాథులుగా వదలిపెట్టను. నేను మీ యొద్దకు వస్తాను" - 14,18. ఆత్మడు వచ్చి క్రీస్తుని తొలగించడు. క్రీస్తుని మనకు ప్రత్యక్షం చేస్తాడు.
క్రీస్తు చనిపోతూ మనకొరకు ఆత్మను విడిచాడు - యోహా 19,30. బల్లెంతో పొడిచిన ప్రభువు ప్రక్కనుండి నెత్తురూ నీరూ కారాయి 19,34 ఈ నీరు ఆత్మనే సూచిస్తుంది.
క్రీస్తు ఆత్మా ఏకవ్యక్తికాదు. వేరు వేరు వ్యక్తులు. ఆత్మ మరొక ఆదరణకర్త - 14,16. 

క్రీస్తు మహిమను పొందకముందు లోకంలో ఇంకా ఆత్మలేదు - 7,39.

4. పౌలు పవిత్రాత్మను దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అని పేర్కొన్నాడు - రోమా 8,9. క్రీస్తు ఆత్మా కలసే విశ్వాసులను నీతిమంతులనుగా జేస్తారు - 1కొ 6,11. విశ్వాసులు క్రీస్తుకి దేహమౌతారు. ఆత్మకు ఆలయమౌతారు -1కొ 6,15,19. క్రీస్తూ ఆత్మా ఎప్పుడూ కలసిపోతూంటారు. ఏనాడూ ఒకరినుండి ఒకరు వేరుకారు. ఆత్మసహాయం లేందే ఇప్పడు మనం క్రీస్తుని విశ్వసించలేం. "పవిత్రాత్మ వలన తప్ప ఎవడుకూడ యేసే ప్రభువు అని అంగీకరించలేడు” - 1కొ 12,3.