పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు అక్కడినుండి ఆతెన్సు నగరానికి వచ్చాడు. ఆ పట్టణం గ్రీకు విద్వాంసులకు కేంద్రస్థానం, పౌలు ఆ పండితుల సభలో ఉపన్యసించాడు. కాని వాళ్ళ పౌలుని ఎగతాళి చేసారు. నీ బోధలు మరోసారి వింటాంలే అన్నారు. పౌలుకి తలవంపులు పచ్చాయి. అతనికి తన అసామర్థ్యం తెలియవచ్చింది - అకా 17, 16-30.

అక్కడి నుండి అతడు కొరింతుకు వచ్చాడు. అక్కడ క్రీస్తుని బోధిస్తూంటే యూదులు అతన్ని ఎదిరించారు. అతని మీద నిందలు మోసారు. పౌలుకి మళ్ళీ తన బలహీనత అనుభవానికి వచ్చింది- అకా 18, 6. ఈ చివరి అనుభవాన్ని గూర్చి అతడు నేను కొరింతులో వున్నపుడు బలహీనతవల్ల భయకంపితుజ్ఞయ్యాను అని చెప్పకొన్నాడు - 1కొ 2,3.

పౌలు ఇన్ని పరాజయాలను చవిజూచినవాడు. ఇన్నిసారులు బలహీనతలను అనుభవించినవాడు. తన అశక్తతను తాను చక్కగా అర్థంచేసికొన్నవాడు. కాని ఆ యశక్తతను తలంచుకొని నిరుత్సాహపడలేదు. అతని విజయమంతా ఆ యశక్తతలోనే వుంది. ఎందుకంటే తాను అశక్తజ్ఞని నమ్మి ప్రభువుని ఆశ్రయించినప్పడే అతనికి దైవశక్తి లభిస్తుంది. అతడెప్పడు బలహీనుడో అప్పడే బలవంతుడు - 2 కొ 12, 10. ప్రేషితోద్యమంలో అతని విజయమంతా ఈ సూత్రంమీదనే ఆధారపడి ఉంది.

3. మానుష బలం చాలనికాడనే దైవబలం

నరుని బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణ మౌతుందని గుర్తించాడు పౌలు. బైబుల్లోని చాల సంఘటనలకు ఈ సూత్రం వర్తిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

గిద్యోను యిప్రాయేలీయులకు న్యాయాధిపతిగా పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో మిద్యానీయులనే శత్రువులు వాళ్ళను పీడిస్తుండేవాళు, ప్రభువు గిద్యోనుద్వారా యిస్రాయేలీయులను రక్షించడానికి పూనుకొన్నాడు. గిద్యోను 32 వేలమంది సైన్యంతో బయలుదేరాడు. కాని ఆ సైన్యాన్నిజూచి యిస్రాయేలీయులు మా బలంతో మమ్ము మేమే రక్షించుకొన్నామని విర్రవీగవచ్చు. కనుక ప్రభువు ఆ సైన్యాన్ని తగ్గించివేయమన్నాడు. గిద్యోను పౌజను పదివేలకు తగ్గించాడు. ప్రభువు ఇంకా తగ్గించమన్నాడు. అతడు కేవలం 300కు తగ్గించాడు. ఆ మూడు వందలమంది భటులతోనే ప్రభువు అతనికి శత్రువుల మీద విజయం చేకూర్చి పెట్టాడు - న్యాయా 7, 2–7. మానుష బలమున్న కాడ గర్వమంటుంది కనుక దైవబలం పనిచేయదు. మానవ బలం లేనికాడ వినయం వుంటుంది. కనుక దైవశక్తి పనిచేస్తుంది.

యిస్రాయేలీయులకు ఫిలిస్ట్రీయులు ప్రబల శత్రువులు. వాళ్ళ వీరుడు గొల్యాతు. అతడు యుద్ధంలో కాకలు తీరిన జోదు. యిప్రాయేలీయుల వీరుడు దావీదు. అతడు బాలుడు. గొల్యాతు కత్తి, యూటె, బాకు తీసికొని మానుషబలంతో వచ్చాడు. దావీదుకి మానుషబలంలేదు. అతడు కేవలం వడిసెలతో వచ్చాడు. కాని దైవబలం అతనికి అండగా