పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

- యెష 63,10. కనుక పూర్వవేద నిబంధన చరిత్ర ఆత్మద్వారానే నడిచింది. తర్వాత ప్రభువు నూత్నవేద ప్రజలతో గూడ నిబంధనం చేసికొన్నాడు. ఈ నూత్న నిబంధనపు మధ్యవర్తి క్రీస్తే. యావే ఆత్మ అతనిమీదికి గూడ దిగివచ్చింది.

దేవుని ఆత్మ అతనిపై నిలుస్తుంది
అది విజ్ఞాన వివేకాలను ఒసగే ఆత్మ
దూరదృష్టినీ బలాన్నీ ప్రసాదించే ఆత్మ
దైవజ్ఞానాన్నీ దైవభీతినీ దయచేసే ఆత్మ

- యెష11.2. ఈ విధంగా పూర్వ నూ

త్న నిబంధనలు కూడ ఆత్మద్వారానే నెలకొన్నాయి. 2. లూకా సువిశేషంలో మెస్సీయా ఆత్మద్వారా రక్షణ చరిత్రను కొనసాగించుకొని పోతాడు. అతడు ఆత్మ ప్రభావంవల్ల జన్మించాడు-1,35. జ్ఞానస్నాన సమయంలో ఆత్మ అతనిమీదికి పావురంలా దిగివచ్చి అతన్ని మెస్సీయాగా అభిషేకించింది. అటుపిమ్మట అతన్ని ఎడారికి తోడ్మొనిపోయింది - 4,4. క్రీస్తు ఆత్మప్రభోధంతో పిశాచాలను వెళ్ళగొట్టి దైవరాజ్యాన్ని నెలకొల్పాడు – 11,20. ఆత్మ నరునికి స్నేహితుడై రక్షణచరిత్రను నడిపించుకొనిపోతుంది, క్రీస్తుద్వారా దైవప్రజలకు పరలోక రాజ్యాన్ని స్థాపించిపెడుతుంది. గ్రీకు రోమను ప్రజలూ, మనదేశంలోని హిందూ ప్రజలూ జననమరణాదులతో కూడిన సంసార చక్రంలో చిక్కుకొనిపోయారు. కాని దైవప్రజల కొరకు ఆత్మ నడిపించే రక్షణచరిత్ర మాత్రం అలా జననమరణాదుల్లో చిక్కుకొనిపోక, క్రీస్తుద్వారా ఓ నిర్ణీత గమ్యాన్ని చేరుతుంది. ఆత్మ మహాశక్తితో పనిచేసి సుతుణ్ణి లోకంలో నరుడ్డిగా పుట్టించింది. రక్షణాద్యమానికి గమ్యాన్ని సాధించిపెట్టేది ఈ సుతుడే.

3. రక్షణచరిత్రకు ఆదీ అంతమూ ఆత్మే. ఆత్మ ద్వారానే ఆదిలో జలరాశినుండి ప్రాణికోటి పుట్టింది - ఆది 1,2. ఈ దివ్యచరిత్రకు అంతంకూడ ఆత్మే కనుకనే ఆత్మా వధువు ఇద్దరూ క్రీస్తుని తిరిగిరమ్మని ఆహ్వానిస్తారు - దర్శ 22, 17. ఈ క్రీస్తు పుట్టుక ఆత్మద్వారానే అని చెప్పాం. అతని వుత్తానంగూడ ఆత్మద్వారానే - రోమా 8,11.

4 రక్షణచరిత్రకు ఆత్మ ఆదీ అంతమూ అంటే, ఆ యాత్మడు అతి ముఖ్యమైనవాడు, మన హృదయాల్లో వసించేవాడు అని భావం. కనుకనే ప్రభువు యెహెజ్కేలు ప్రవక్తద్వారా నా యాత్మను నీ హృదయాల్లో వుంచుతాను అన్నాడు — 36,26. ఇంకా, దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోకి పంపాడు - గల 4,6. ఆత్మద్వారా దేవుడు ప్రేమను మన మృదయాల్లోకి కుమ్మరించాడు - రోమా 5,5. మన ఉత్తానమూ మోక్ష ప్రవేశమూ ఆత్మద్వారానే - 2కొ 1,22. సంగ్రహంగా చెప్పాలంటే