పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. వినయాన్ని ఏలా సాధించాలి?

పాపపు నరులమైన మనం సహజంగానే గర్వాత్ములం. మనకు వినయం సులువుగా అలవడదు. కనుక మనం క్రీస్తుని చూచి వినయాన్ని నేర్చుకోవాలి. అతడు దేవుడైకూడ నరుడుగా జన్మించాడు. జీవితాంతం వినయంతో జీవించాడు, మరణం వరకు, సిలువ మరణం వరకు గూడ, విధేయుడయ్యాడు. కనుక తండ్రి అతన్ని అధికంగా హెచ్చించాడు. అన్ని నామాల కంటె శ్రేష్టమైన నామాన్ని అతనికి అనుగ్రహించాడు. ఈలా వినయాత్మడైన క్రీస్తు మనకు ఆదర్శం. ఆ ప్రభువు "మీరు నా కాడిని ఎత్తుకొనండి. నేను సాధుశీలుడ్డి వినమహృదయుడ్డి అని నా నుండి నేర్చుకొనండి" అని పల్కాడు - మత్త 11, 29.

మనం దేవునిపట్లా, తోడి నరులపట్లా, వ్యక్తిగత జీవితంలోనుగూడ వినయాన్ని చూపించాలి. ఈ మూడంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

1) దేవునిపట్ల వినయం. ఆరాధన, కృతజ్ఞత, ఆధారభావాలద్వారా దేవునిపట్ల వినయాన్ని ప్రదర్శిస్తాం.

సర్వసంపూరుడైన దేవుణ్ణి ఆరాధించి అతని ముందట మన తక్కువతనాన్నీ పాపాన్నీ వొప్పకోవాలి. అతన్నిస్తుతించి కీర్తించాలి. ఆ ప్రభువు నెదుట మన విశ్వాసాన్నీ భయభక్తులనూ వెల్లడి చేయాలి. నీ వొక్కడివే పరిశుద్దుడవు, నీ వొక్కడివే ప్రభువువి, నీ వొక్కడివే మహోన్నతుడవు అని ప్రకటించాలి.

మనకున్న ఆధ్యాత్మిక వరాలూ భౌతిక వరాలూ అన్నీ దేవుడిచ్చినవే. ఈ వరాలన్నిటికి ఆ ప్రభువు స్తుతించాలి. అతనికి కృతజ్ఞత తెలియజేయాలి, మరియమాతలాగ "నా హృదయం ప్రభువుని స్తుతిస్తూంది. సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యాలు చేసాడు” అని చెప్పాలి.

మనకు స్వయంశక్తిలేదు. కనుక మనం నిరంతరం దేవునిమీద ఆధారపడి జీవించాలి. ఆయా పనులు ప్రారంభించక ముందు దేవుని సహాయం అడుగుకోవాలి. వాటిని ముగించాక దేవునికి వందనాలు చెప్పకోవాలి. అనవరతం దైవబలంమీద ఆధారపడి జీవించాలి.

2) తోడి నరులపట్ల వినయం. భగవంతునిపట్ల వినయాన్ని ప్రదర్శించడం సులభమే. కాని తోడి నరులపట్ల వినయాన్ని చూపించడం ఎంతమాత్రం సులభంకాదు. ఐనా ఇది అవసరం. మనం తోడి నరుల్లోని ఆధ్యాత్మిక వరాలనూ భౌతిక వరాలనూ గుర్తించి వారిని ప్రశంసించాలి. నరుల మంచితనం దేవునికే కీర్తి తెచ్చిపెడుతుంది. వారిలోని 'లోపాలను చూచీచూడనట్లు వదలివేయాలి. విశేషంగా ఇతరులను చక్కదిద్దే పూచీ మనకు లేనపుడు, వారి లోపాలను పట్టించుకోగూడదు. ఇతరులు పొరపాటు చేసినపుడు, పాపంలో