పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమస్తం దేవదేకదా నీ కిచ్చింది? ఐతే నీకున్నది దేవుడిచ్చిన దానం కాదన్నట్లు నీవు గర్వించడం దేనికి" అని ప్రశ్నించాడు - 1కొ 4,7.

కొందరికి వినయం అంత సలువుగా అలవడదు. వీళ్ళు తమ్ముగూర్చి తాము ఘనంగా యెంచుకొంటారు. తమ్ముగూర్చి తాము గొప్పలు చెప్పకొంటారు. ఈలాంటివాళ్ళు విశేషంగా తమ పాపాలు తలంచుకొని తమ్ముతాము తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మనమందరమూ జన్మపాపంతో పడతాం. కనుక పాపంలోనే పట్టిన నరునికి అహంభావం తగదు. ఇంకా మనం బుద్థి వివరం తెలిసిననాటి నుండి ఎన్నో సాంతపాపాలుకూడ చేస్తుంటాం. ඩීඩීපී నరకశిక్షకు పాత్రులమా తాం, ఈలాంటి వాళ్ళం మిడిసిపాటుతో విర్రవీగడం తగుతుందా? పైపెచ్చు, దేవుని వరప్రసాద బలమే లేకపోతే మనమింకా యెన్నో పాపాలు మూటకట్టుకొని వుండేవాళ్ళమే. వరప్రసాద బలమే మనలను ఆయా ప్రత్యేక పాపాలనుండి కాపాడింది. ఈ సందర్భంలో అగస్టీను భక్తుడు ఈలా వాకొన్నాడు: “ఓ ప్రభూ! నేను ఏయే పాపకార్యాలు చేయలేదో వాటన్నిటినుండి నన్ను కాపాడింది నీ వరప్రసాదమే. నేను పాపం కొరకే పాపం చేసే కనుక నేను ఏలాంటి దుష్కార్యమైన చేసివుండేవాణ్ణి కదా? ప్రభూ! నీవు నా పాపాలన్నీ మన్నించినందులకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నేను యథార్థంగా చేసిన పాపాలనూ, నీ కృపవల్ల చేయక వదలివేసిన పాపాలను గూడ నీవు మన్నించావు". ఈ పునీతుని వాక్యాలు మనకుకూడ అక్షరాల వర్తిస్తాయి, వరప్రసాద బలం మనలను ఎన్నో పాపాల నుండి తప్పిస్తుంది. ఈలా నిరంతరం పాపంవైపే మొగ్గేవాళ్ళం, దేవుని వరప్రసాదంవల్ల మాత్రమే ఆ పాపం నుండి తప్పించుకొన్నవాళ్ళం మనం గొప్పలు చెప్పకొంటే చెల్లుతుందా? ఫలితార్థమేమిటంటే, పాపపు నరులమైన మనం మన పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని మనలను మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి.

2. వినయం యొక్క ప్రాశస్త్యం

వినయం గొప్పతనాన్ని రెండు విధాల అర్థం చేసికోవచ్చు. మొదటిది, అది మనకు వరప్రసాదాలను సంపాదించి పెట్టే సాధనం. “దేవుడు అహంకారులను ఎదిరించి వినములకు తన కృపను అనుగ్రహిస్తాడు" - యాకోబు 4,6. దేవుడు వినయాత్మలకు కృపను ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే వాళ్లు తమకు తాము ఘనతను ఆపాదించుకోరు. గర్వంతో పొంగిపోరు. దేవుడు తమకు దయచేసిన వరప్రసాదాలకు అతన్ని స్తుతించి కీర్తిస్తారు. అందుచేత ప్రభువు సంతోషంతో వాళ్ళకు తన కృపను దయ చేస్తాడు. వాళ్ళ ద్వారా అతని కీర్తి పెరుగుతుందేగాని తరగదు. కాని ప్రభువు గర్వాత్ములకు తన కృపను దయచేయడు. ఎందుకంటే, వాళ్లు దేవుణ్ణి కీర్తించడానికి బదులుగా తమ్ముతామే కీర్తించు కొంటారు. ఇది దేవునికి నచ్చదు. అతడు తన కీర్తిని ఇతరులతో పంచుకొనేవాడు కాదుయెష 12,8. కనుక అతడు గర్విషులకు సాయంచేయడు. ఈలా అణకువ మనకు