పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధం- 1. వినయం

ఇక్కడ నాల్గంశాలు పరిశీలిద్దాం. ప్రాచీన గ్రీకు, రోమను ప్రజలు వినయాన్ని అంగీకరించలేదు. వినయమంటే అణకువ, లొంగివుండడం. కనుక ఆత్మోత్కర్షగల అన్యజాతి ప్రజలకు ఈ పుణ్యం గిట్టలేదు. SoS) పూర్వవేదపు యూదులు మాత్రం దైవానుగ్రహంవల్ల ప్రబోధితులై వినయాన్ని అంగీకరించారు. పశ్చాత్తాప పూరితులూ వినయాన్వితులూ ఐన వారిని ప్రభువు ఆనాదరం చేయడని స్పష్టంగా చెప్తుంది పూర్వవేదం, నూత్నవేదంలో క్రీస్తు వినయాన్ని బోధించాడు, స్వయంగా పాటించాడు కూడ. నేడు ఆ ప్రభువు మనకు ఆదర్శం.

1. వినయం అంటే యేమిటి?

నరుడు ఆత్మజ్ఞానం ద్వారా తన తక్కువతనాన్ని తాను గుర్తించి తన్ను తాను తగ్గించుకోవడం వినయమౌతుంది. ఈ నిర్వచనంలో రెండు అంశాలున్నాయి. మొదటిది, మన అల్పత్వాన్ని మనం అర్థం చేసికోవాలి. మన శక్తిసామార్యాలు దేవునినుండి వచ్చినవిగాని మనం స్వయంగా ఆర్థించినవి కావు. కనుక మనలను మనం తక్కువగా అంచనా వేసికోవాలి. రెండవది, రోజువారి జీవితంలో మనలను మనం తగ్గించుకోవాలి, ఈ తగ్గించుకోవడమనేది నిందావమానాలు భరించే వరకు పోవాలి.

అణకువలో సత్యం, న్యాయం, అనే రెండు లక్షణాలున్నాయి. మనలోని మంచిఅంతా దేవుని వద్దనుండి వచ్చిందే. మనలోని దుష్టత్వమంతా మననుండి వచ్చిందే. కనుక మన అల్పత్వాన్ని మనం అంగీకరించాలి. ఇది సత్యం.

మన అల్పత్వాన్ని మనం అంగీకరించాక, మనలోని మంచికి దేవునికి వందనాలర్పించాలి. ఈ మంచి మన సాత్తుగాదు, భగవంతునిసౌత్తు. కనుక మనలోని గొప్పగుణాలను మనమే ఆర్ధించినట్లుగా పొంగిపోకూడదు. వాటికి కర్తయైన దేవునికి వందనాలర్పించాలి. ఇది న్యాయం. మనలో మంచి అనేది లేకపోలేదు. మనం కృషి చేయకపోలేదు. కాని ఈ కృషికీ ఈ మంచికీగూడ కర్త దేవుడే. అతని వరప్రసాదం వల్లనే మనం మంచిని చేయగల్లుతున్నాం. లేకపోతే పూర్తిగా బ్రషులమై పోయివుండేవాళ్ళమే. చిత్రకారుడు నారబట్టపై బొమ్మను చిత్రిస్తే నారబట్టను మెచ్చుకోం. చిత్రకారుణ్ణి మెచ్చుకొంటాం. ఆలాగే మనలోని మంచికి మనలను మనం మెచ్చుకోగూడదు. ఆ మంచికి కారకుడైన దేవుణ్ణి మెచ్చుకోవాలి.

వినయంగా వుండడమంటే మనలో మంచిలేదని చెప్పకోవడంగాదు. మనలో శక్తిసామర్థ్యాలు లేవని తలంచడం గాదు. కాని ఆ మంచీ ఆ శక్తిసామర్థ్యాలు దేవుని వద్దనుండే వచ్చాయని అంగీకరించడం. దేవుని వరాలనూ దానాలనూ పొందిన పిమ్మటకూడ మన విలువ అత్యల్పమని గ్రహించడం. ఈ సందర్భంలో పౌలు "నీకున్నది