పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు ఇట్లంటున్నాడు
ఇప్పడైన మిూరు పూర్ణహృదయంతో నాచెంతకు మరలిరండి
ఉపవాసంతో సంతాపంతో ఏడ్పులతో
నా వద్దకు తిరిగిరండి" - 2,12-13.

క్రీస్తు స్వయంగా ఉపవాసాన్ని పాటించాడు. “నలువది రేయింబవళ్ళు ఉపవాసాలతో గడిపిన పిదప అతనికి ఆకలి వేసింది" - మత్త 4,2. అతడు ఉపవాసాన్ని గూర్చి చాలసార్లు బోధించాడుకూడ. ఓసారి శిష్యులు ఓ బాలుని నుండి మూగదయ్యాన్ని పారదోలలేకపోయారు. కాని క్రీస్తు ఆ భూతాన్ని వెళ్ళగొట్టాడు. అది మాకెందుకు లొంగలేదో చెప్పమని వాళ్లు క్రీస్తు నడిగారు. ప్రార్థన ఉపవాసాలవల్ల మాత్రమే ఈలాంటి దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు అని క్రీస్తు జవాబు చెప్పాడు - మార్కు 9,29. కనుక క్రీస్తు బోధల ప్రకారం మనం ఉపవాసాన్ని పాటించాలి. భోజన విషయంలో మితత్వాన్ని గూర్చి ఖండితమైన నియమాలేవీ లేవు. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్లు మితత్వాన్ని పాటించాలి. మనం ఎన్నిసార్లు తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏలాంటి తిండి తింటున్నాం అనే విషయాలన్నిటిలోను సంయమనాన్ని పాటించాలి.

మనదేశంలో మద్యపానం దుర్గునం క్రిందికే వస్తుంది. దేహారోగ్యానికి గాని పుష్టికిగాని సారాయం అవసరంకాదు. కనుక మద్యాన్ని పూర్తిగా మానుకోవడమే మెరుగు. ఈ సందర్భంలో చుట్ట, సిగరెట్ల మొదలైన వాటినిగూడ ప్రాస్తావించాలి. భోజనంలాగ పొగత్రాగడం అవసరంకాదు. ఐనా చాలమంది చుట్టా సిగరెట్లమిూద ఎంతో డబ్బు తగలేస్తారు, వీటిని పూర్తిగా విసర్జించడం ఉచితం. అలాగే అతినిద్రకూడ పనికిరాదు, మితిమిూరిన నిద్ర సోమరితనాన్నీ బద్దకాన్నీ తెచ్చిపెడుతుంది. ప్రార్థనకు ఆటంకం కలిగిస్తుందికూడ. కనుక అనవసరమైన నిద్రను త్యజించాలి.

ఉపవాస శుద్ధభోజనాలద్వారాను, మద్యం చుట్టా బీడీలు మొదలైనవాటిని పరిత్యజించడం ద్వారాను కొంత సొమ్ము ఆదాచేస్తాం. ఆ సొమ్మును పేదల భోజనావసరాలకు వెచ్చించడం ఉచితం. మనది పేదదేశం, ఎప్పడూ కొందరు పస్తులుండనే వుంటూంటారు. కనుక మన ఖర్చులను కొంచెం తగ్గించుకొని మిగిలిన సొమ్మను పేదల తిండి కొరకు వెచ్చిస్తే సోదరప్రేమను పాటించినవాళ్ల మౌతాం. వట్టి ఉపవాసం కంటె సోదరప్రేమతో గూడిన ఉపవాసం అధిక పవిత్రమైంది.

2. లైంగిక ప్రీతి

భగవంతుడు వ్యక్తి ప్రాణాలను నిలబెట్టడానికి భోజనప్రీతిని దయచేసాడు. మనం భోజనాన్ని తగినంతగా భుజించి వ్యక్తిగతంగా శరీరాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే అతడు